ప్రియుడితో లేటు వయసు భామ ఘాటు రొమాన్స్

బాలీవుడ్ భామ సుష్మితా సేన్ ప్రియుడు రోహ్మాన్‌తో కలిసి యోగా చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : April 2, 2020 / 08:01 AM IST
ప్రియుడితో లేటు వయసు భామ ఘాటు రొమాన్స్

Updated On : April 2, 2020 / 8:01 AM IST

బాలీవుడ్ భామ సుష్మితా సేన్ ప్రియుడు రోహ్మాన్‌తో కలిసి యోగా చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి..

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యులు కొందరు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులను వీడియోల రూపంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్స్ వర్కౌట్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తన ప్రియుడితో కలిసి కపుల్ యోగా చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుష్మిత షేర్ చేసిన వీడియోలో బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కలిసి చాలా శ్రద్ధగా వివిధ భంగిమల్లో యోగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్ నేపధ్యంలో సుష్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్, ఇద్దరు కుమార్తెలతో పాటు ఇంట్లోనే ఉంటోంది. 44 ఏళ్ల సుష్మితా సేన్ 28 ఏళ్ల తన ప్రియుడు రోహ్మాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Read Also : నిర్మాతతో నటుడి పెళ్లి పెటాకులు!

ఇందులో వారిద్దరూ హాట్ హాట్ ఫోజులతో అదరగొట్టేశారు. వీరిమధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉందనేది ఈ పిక్స్ చూస్తే తెలుస్తోంది. ఇద్దరూ బ్లాక్ కలర్ దుస్తులతో కనిపిస్తున్నారు. కుర్రకారు మలైకా అరోరాకు అర్జున్ కపూర్, సుష్మితకు రోహ్మాన్ లేటు వయసు భామల ఘాటు రిలేషన్‌కు కుర్రాళ్లు కరెక్ట్‌గా సూట్ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.