SV Rangarao Grand Sons : బాలకృష్ణ ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. బాలయ్యని సపోర్ట్ చేసిన ఎస్వీ రంగారావు మనవళ్లు..
ఈ వీడియోలో ఎస్వీ రంగారావు మనవళ్లు మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవళ్లుగా................
- Saketh U
- Published On : January 26, 2023 / 06:42 AM IST
SV Rangarao Grand Sons spoke about Balakrishna issue
SV Rangarao Grand Sons : ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల పేర్లు తీసుకొచ్చి రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని మాట్లాడింది కాదని ఆ స్పీచ్ చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ ఫ్లోలో బాలకృష్ణ అలా మాట్లాడటంతో అక్కినేని అభిమానులు సీరియస్ అయి బాలయ్యపై విమర్శలు, ట్రోల్స్ చేశారు. దీనిపై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా స్పందిస్తూ.. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం, మనల్ని మనం కించపరుచుకోవటమే అంటూ ట్వీట్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో ఎస్వీ రంగారావు గారిని కూడా చేర్చి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. తాజాగా ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు.
Adivi Sesh : పెళ్లి పనులు మొదలు పెట్టిన అడివి శేష్.. జనవరి 26న పెళ్లి..
ఈ వీడియోలో ఎస్వీ రంగారావు మనవళ్లు మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవళ్లుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా ఉంటాం. ఆయన మాట్లాడింది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం అని తెలిపారు. ఈ వీడియోలో స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు, ఎస్.వి.ఎల్.ఎస్. రంగారావు (బాబాజీ) మాట్లాడారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు బాలయ్య స్పందించలేదు.
