‘Swathi’ Balaram : సూపర్ హిట్ మ్యాగజైన్ ‘స్వాతి’ ఓనర్ వేమూరి బలరాం బయోపిక్.. త్వరలో..

40 ఏళ్ళుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక వారపత్రిక స్వాతి. ఈ పుస్తక ఫౌండర్, ఎడిటర్ వేమూరి బలరాం జీవితంపై ఇప్పుడు ఓ బయోపిక్ రాబోతుంది.

Swathi Book Founder Vemuri Balaram Biopic Coming Soon

‘Swathi’ Balaram :  తెలుగులో సూపర్ హిట్ మ్యాగజైన్స్ లో స్వాతి మ్యాగజైన్ ఒకటి. 1984లో స్వాతి మొదటి బుక్ పబ్లిష్ అయింది. అప్పట్నుంచి చాలామంది తెలుగు ప్రజలు అందరూ ప్రతి గురువారం ‘స్వాతి’ బుక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్థాయి పాఠకాదరణ సొంతం చేసుకున్న, 40 ఏళ్ళుగా విజయవంతంగా నడుస్తున్న ఏకైక వారపత్రిక స్వాతి. అద్భుతమైన కథలు, ఆసక్తికర విషయాలతో.. యూత్, ఫ్యామిలీ, పిల్లలు. అందరికి నచ్చిన పుస్తకం స్వాతి. పాఠక దేవుళ్ళు అంటూ బుక్స్ చదివే వారిని మరింత ఆకర్షించారు ఈ పుస్తక ఫౌండర్, ఎడిటర్ వేమూరి బలరాం.

స్వాతి బలరాంగా తెలుగువారికి పరిచయమైన వేమూరి బలరాం జీవితంపై ఇప్పుడు ఓ బయోపిక్ రాబోతుంది. ‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రముఖ రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, కాళోజీ నారాయణరావు బయోపిక్ ‘ప్రజాకవి కాళోజీ’ లాంటి సినిమాలు తెరకెక్కించిన ప్రభాకర్ జైనీ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. జైనీ క్రియేషన్స్ పతాకంపై స్వాతి బలరామ్ బయోపిక్ ను విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలవనుంది.

Samantha : ఇప్పటికింకా నా వయసు పదహారే.. 16 ఏళ్ళప్పటి సమంత ఎలా ఉందో చూశారా?

తాజాగా ఈ బయోపిక్ అనౌన్స్ చేస్తూ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రభాకర్ జైనీతో పాటు స్వాతి బలరాం కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ.. గత నలభై సంవత్సరాలుగా తెలుగు వారు చదువుతున్న ఏకైక వారపత్రిక స్వాతి. నవరసాల సాహిత్యంతో ప్రతీ ఒక్కరినీ అలరింప చేసిన సాహితీ సమరాంగణా సార్వభౌముడు బలరామ్ గారు. బలరామ్ గారిని ‘కాళోజీ’ బయోపిక్ తీస్తున్న సమయంలో కలిశాను. అప్పుడు ఓ చిన్న ఆలోచన మదిలో మెదిలి సార్ మీ బయోపిక్ తీద్దాం అన్నాను. ఆయన ఓకే చెప్పాక చాలా రీసెర్చ్ చేశాను ఆయన జీవితంపై. ఆయన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా వాటి కన్నా ఎక్కువ విషాదాలు ఉన్నాయి. స్వాతిని ఈ స్థాయికి తేవడానికి 1970 నుండి ఈ నాటికీ ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియాలి. అందుకే ఈ సినిమా తీస్తున్నాను అని తెలిపారు. స్వాతి బలరాం బయోపిక్ తీస్తున్నారు అనడంతో స్వాతి బుక్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.