Swathimuthyam: బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ ‘స్వాతిముత్యం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లక్షణ్ కె కృష్ణ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి.
ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాలోని ఫ్యామిలీ ఎమోషన్స్ అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించిందట. కాగా, ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Swathimuthyam Director : చిరంజీవి, నాగార్జునకి పోటీగా.. అది నిర్మాతల నిర్ణయం.. నాకు భయంగానే ఉంది..
ఈ సినిమాలో నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.