Swayambhu star Nikhil Siddhartha is going to be a father
Nikhil Siddhartha : టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా విజయం అందుకున్న నిఖిల్.. ఇప్పుడు మరో మూడు పాన్ ఇండియా చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాలు వరుసలో ఉన్నాయి. వీటిలో ముందుగా ‘స్వయంభు’ సినిమాని సిద్ధం చేస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో ఫుల్ హ్యాపీలో ఉన్న నిఖిల్.. పర్సనల్ లైఫ్ లో తాజాగా ఒక గుడ్ న్యూస్ అందుకున్నారు.
ఈ యంగ్ హీరో త్వరలో తండ్రి కాబోతున్నారట. నిఖిల్ 2020లో పల్లవి వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఒక ఫంక్షన్ లో ఆమె బేబీ బంప్ తో కనిపించారు. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్.. నిఖిల్ తండ్రి కాబోతున్నారా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఇండస్ట్రీ వర్గం వ్యక్తులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. నిఖిల్ తండ్రి కాబోతున్నారంటూ తెలియజేస్తున్నారు. దీంతో నెటిజెన్స్ నిఖిల్ కి విషెస్ తెలియజేస్తున్నారు.
Also read : Naga Chaitanya : క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు నాగచైతన్య చేయూత..
ఇక ‘స్వయంభు’ సినిమా విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. బాలకృష్ణ ‘భైరవ ద్వీపం’ సినిమా తరహాలో ఈ చిత్రం ఉండబోతుందంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.