సైరా – కామిక్స్ బుక్ వచ్చేస్తుంది!

ఇప్పటి తరానికి స్ఫూర్తిదాయకమైన నరసింహారెడ్డి జీవితం గురించి, ఆయన కొనసాగించిన స్వాతంత్ర్య పోరాట ప్రయాణం గురించి తెలియచెప్పాలనే ఆలోచనతో.. 'నరసింహారెడ్డి - ది లయన్ ఆఫ్ రాయలసీమ' పేరుతో పుస్తకాన్ని ప్రచురించనున్నారు..

  • Publish Date - September 25, 2019 / 07:01 AM IST

ఇప్పటి తరానికి స్ఫూర్తిదాయకమైన నరసింహారెడ్డి జీవితం గురించి, ఆయన కొనసాగించిన స్వాతంత్ర్య పోరాట ప్రయాణం గురించి తెలియచెప్పాలనే ఆలోచనతో.. ‘నరసింహారెడ్డి – ది లయన్ ఆఫ్ రాయలసీమ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించనున్నారు..

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైరా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇదిలా ఉంటే త్వరలో నరసింహారెడ్డి కామిక్స్ బుక్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి తరానికి స్ఫూర్తిదాయకమైన నరసింహారెడ్డి జీవితం గురించి, ఆయన కొనసాగించిన స్వాతంత్ర్య పోరాట ప్రయాణం గురించి తెలియచెప్పాలనే ఆలోచనతో.. ప్రముఖ కామిక్ పుస్తకాల ప్రచురణ సంస్థ అమర్ చిత్ర కథతో కలిసి ‘నరసింహారెడ్డి – ది లయన్ ఆఫ్ రాయలసీమ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించనున్నారు.

Read Also : రాగల 24 గంటల్లో – టీజర్..

రీసెంట్‌గా ఫస్ట్‌లుక్ పేరుతో ఈ బుక్ కవర్ పేజీని రిలీజ్ చేశారు. త్వరలో బుక్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేసి, ఆన్‌లైన్‌‌లో అమ్మకానికి ఉంచనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’  భారీగా విడుదల కానుంది. 

 

ట్రెండింగ్ వార్తలు