Taapsee Pannu : సినిమాలని బాయ్ కాట్ చేయడం అనేది పెద్ద జోక్.. ఏ సినిమా చూడాలో చూడొద్దో ప్రేక్షకులకి తెలుసు
ప్రస్తుతం తాప్సీ తన దొబారా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై తాప్సీ మాట్లాడింది. తాప్సీ మాట్లాడుతూ..............

Taapsee Pannu comments on boycott bollywood trend
Taapsee Pannu : ఇటీవల బాలీవుడ్ సినిమాలని వ్యతిరేకిస్తూ సోషల్‌మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొన్నే ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాని అమీర్ ఖాన్ గతంలో దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ బాయ్‌కాట్ చేశారు. సోషల్ మీడియాలో కొన్ని రోజుల వరకు ఇది ట్రెండింగ్ గా నిలిచింది. ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాని సపోర్ట్ చేసినందుకు హృతిక్ రోషన్‌పై కూడా నెటిజన్లు సీరియస్ అవుతూ తన నెక్స్ట్ సినిమా విక్రమ్ వేదని కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల కొంతమంది తాప్సి కొత్త సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం తాప్సీ తన దొబారా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై తాప్సీ మాట్లాడింది. తాప్సీ మాట్లాడుతూ.. ”ఇలా సినిమాలని బాయ్ కాట్ చేయండి అని చెప్పడం ప్రేక్షకుల మేధస్సును కించపరచడమే. ఏ సినిమాని చూడాలి, ఏ సినిమాని చూడకూడదు అనే విచక్షణ ప్రేక్షకులకు ఉంది. సినిమా బాగుంటే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. దీనికి సినిమాని బాయ్ కాట్ చేయండని చెప్పడం ఎందుకు. నాకైతే సినిమాలని ఇలా బాయ్ కాట్ చేయడం అనేది పెద్ద జోక్ లాగా అనిపిస్తుంది. నేను ఇలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులవుతుంది” అని తెలిపింది.