#TAJDividedByBlood : మొఘల్ రాజవంశం, తాజ్ మహల్ పై జీ5 సిరీస్..

ఇప్పటికే పలు రకాల సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న జీ5 తాజాగా మరో కొత్త సిరీస్ ని తీసుకురాబోతుంది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన మొఘల్ వంశంపై వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది జీ5...............

TAJ Divided By Blood series by zee 5 coming soon the story on Mughal Empire

#TAJDividedByBlood : కరోనా సమయంలో, ఆ తర్వాత ఓటీటీకి చాలా డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సినిమాలు, సిరీస్ లు, షోలతో పలు ఓటీటీలు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా టాప్ ఓటీటీలు ఇండియాలో మార్కెట్ క్రియేట్ చేసుకొని రన్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నిప్లస్ హాట్ స్టార్, జీ 5, సోని లివ్, MX ప్లేయర్, ఆహా, ఆల్ట్ బాలాజీ, ఊట్, సన్ నెక్స్ట్, ఈరోస్ నౌ.. ఇలా అనేక రకాల ఓటీటీలు మన దేశంలో ప్రేక్షకులకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా సొంత సినిమాలు, సిరీస్ లు, షోలపై దృష్టి పెట్టి రకరకాల కంటెంట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి.

ఇప్పటికే పలు రకాల సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న జీ5 తాజాగా మరో కొత్త సిరీస్ ని తీసుకురాబోతుంది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన మొఘల్ వంశంపై వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది జీ5. మొఘల్ వంశం, మొఘల్ రాజులు, వాళ్ళ పరిపాలన, వాళ్ళు ఇండియాని ఎలా హస్తగతం చేసుకున్నారు, వారిలో వారికి జరిగిన పోరాటాలు, తాజ్ మహల్, మొఘల్ రక్తపాతం.. ఇలా మొఘల్స్ కి సంబంధించిన అన్ని అంశాలని తీసుకొని తాజ్ – డివైడెడ్ బై బ్లడ్ అనే సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.

Yash Meets Modi : మోదీని కలిసిన రాఖీ భాయ్, కాంతార టీం.. కన్నడ సినిమాపై ప్రశంసలు కురిపించిన మోదీ..

తాజాగా ఈ సిరీస్, టైటిల్ లాంచింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి టైటిల్ ని లాంచ్ చేశారు. అలాగే ఇప్పటికే షూటింగ్ అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఈ సిరీస్ ని రిలీజ్ చేస్తామని జీ5 ప్రకటించింది. దీంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ఈ సిరీస్ ని హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సిరీస్ లో నసీరుద్దీన్ షా, అదితి రావ్ హైదరీ, అషీమ్ గులాటీ, రాహుల్ బోస్, సంధ్యా మృదుల్, తాహా షా, శుభమ్ మెహ్రా, జరీనా వహాబ్, శివాని తన్స్‌కలే, సుబోధ్ భావే, అయామ్ మెహతా.. మరికొంతమంది ప్రముఖులు నటిస్తున్నారు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర చాలా కాలం తర్వాత ఈ సిరీస్ లో నటించారు.