డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ‘రా’ మూవీ..

  • Published By: sekhar ,Published On : July 18, 2020 / 04:33 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ‘రా’ మూవీ..

Updated On : July 18, 2020 / 7:21 PM IST

కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్‌లో లక్ష్మీ డొక్కర సమర్పిస్తున్న చిత్రం ‘రా’. ఈ చిత్రానికి రాజు డొక్కర నిర్మాత మరియు దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘రా’ మూవీ సినిమాటోగ్రాఫర్ విఐపి శ్రీ, కుమరన్, చంటి, మూవీ డైరెక్టర్ రాజు డొక్కర పాల్గొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ప్రాణ నష్టం జరుగుతుందని దానిని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ శాఖ వారు చాలా కష్టపడుతున్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సామాజిక అంశంతో మంచి మెసేజ్‌తో కార్తీక్ క్రియేషన్స్‌లో ‘రా’ సినిమాను చిత్రీకరించినందుకు డైరెక్టర్ రాజు డొక్కరని అభినందిస్తున్నానని, ప్రజలు ఇలాంటి చిత్రాలను ఆదరించి, జాగ్రతలు పాటించాలి అని కోరుతూ సినిమా డైరెక్టర్ రాజు డొక్కర మరియు టీం సభ్యులను అభినందించారు.

Raw Movie Poster

కార్తీక్ క్రియేషన్స్‌లో రాజు డొక్కర నిర్మించి దర్శకత్వం వహించిన ‘రా’ అనే చిత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ మీద తీశారు. యూత్ ఎక్కువగా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్‌ అవుతుంటారు. వారి కోసం ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసిన రాజు డొక్కర గారికి మరియు టీమ్‌కి అభినందనలు తెలుపుతున్నాను.. అని సీతాఫల్‌మండి కార్పొరేటర్ హేమ చెప్పారు.

‘రా’ మూవీ దర్శక నిర్మాత రాజు డొక్కర మాట్లాడుతూ.. పోస్టర్ లాంచ్ చేసిన తలసాని శ్రీనివాస్ గారికి, హేమ గారికి ధన్యవాదాలు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో హార్రర్ బ్యాక్ డ్రాప్‌లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశాము. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరగాల్సి ఉంది. వైజాగ్, పార్వతీపురం, అరకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపాము. త్వరలో ఆడియో, ట్రైలర్ విడుదల చేస్తాము. అందరూ ఈ చిత్రం చూసి ఆశీర్వదించాలి.. అని తెలిపారు.

Raw Movie Poster‘రమణా లోడ్ ఎత్తాలిరా’ డైలాగ్ ఫేమ్ కుమరన్ మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల యూత్ తమ జీవితాలు పాడు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీని వల్ల పేరెంట్స్ చాలా బాధ పడుతున్నారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని కోరుతున్నాను. ఈ మూవీలో ముఖ్య విలన్ పాత్ర చేశాను. ఈ అవకాశం ఇచ్చిన రాజు డొక్కర గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.. అని అన్నారు.