Tamanna
Tamannaah Bhatia : మిల్క్ బ్యూటీగా పేరొందిన తమన్నా నటనలోనే కాదు..డ్యాన్స్ లో అదరగొడుతానంటోంది. తన టాలెంట్ తో అభిమానులు అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ..లెటెస్ట్ గా ఓ డ్యాన్స్ వీడియోతో ముందుకొచ్చింది. ఈ భామ..సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారనే సంగతి తెలిసిందే. తన ఫొటోలు, ఇతరత్రా విశేషాలను ఆమె సోషల్ మీడియాలో తెలియచేస్తుంటారు. లెటెస్ట్ గా ‘కిస్ మీ మోర్’ అనే పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో తమన్నాతో పాటు..ఆమె స్నేహితురాలు కూడా ఉన్నారు. తమన్నా డ్యాన్స్ చూసిన వారందరూ వావ్ అంటున్నారు.
Read More : Gadget Bank : ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచితంగా ఫోన్‌లు..పేద విద్యార్ధుల కోసం వినూత్న కార్యక్రమం
ఏమీ ఎనర్జీ…వాట్ ఏ డ్యాన్స్ అంటూ కితాబిస్తున్నారు. చెత్తని కట్ చేసేయాలి అంటూ ఈమె ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టారు. పాట..మ్యూజిక్ కు అనుగుణంగా..ఆమె స్టెప్పులు వేశారు. వయ్యారంగా నడుము తిప్పుతున్న తమన్నా డ్యాన్స్ చూసిన వారు కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. కేవలం కొద్ది సెకన్ల పాటే ఉన్న ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 319,312 likes రాగా..చాలా మంది కామెంట్స్ చేశారు.
Read More : WhatsApp Privacy Policy : వాట్సాప్ ప్రైవసీ పాలసీ తాత్కాలికంగా నిలిపివేత
ఇక తమన్నా విషయానికి వస్తే..ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్ముడు ప్రస్తుతం కరోనా కారణంగా…వెబ్ సిరీస్, బుల్లితెర షోస్ చేస్తూ బిజీగా మారిపోయారు. OTT ప్లాట్ ఫాంలో పేరు సంపాదించిన ఆహాలో వచ్చిన ‘ది లెవంత్ అవర్’, ‘హాట్ స్టార్’, ‘నవంబర్ స్టోరీ’లు మంచి సక్సెస్ సాధించాయి. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ‘సీటీమార్’ సినిమాను పూర్తి చేసిన తమన్నా ప్రస్తుతం ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్ 3’ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.