WhatsApp Privacy Policy : వాట్సాప్ ప్రైవసీ పాలసీ తాత్కాలికంగా నిలిపివేత
వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేరింగ్ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లంఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

Whatsapp Temporarily Puts Its Privacy Policy On Hold, Delhi High Court Told
WhatsApp Temporarily Privacy Policy Hold : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేరింగ్ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లంఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు (Data Protection Bill) అమల్లోకి వచ్చేంత వరకు తమ ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
వాట్సాప్ యూజర్లు కూడా ఈ పాలసీని అంగీకరించాలని ఇకపై ఒత్తిడి చేయబోమని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేయమంది.. డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చేంతవరకు పాలసీని అమలు చేయమని చెప్పాం. ఎప్పుడు బిల్లు వస్తుందో కచ్చితంగా మాకు తెలియదు. ఒకవేళ బిల్లు దీన్ని అనుమతిస్తే.. అందుకు తగినట్టుగా వ్యవహరిస్తామంటూ వాట్సాప్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే కోర్టుకు వెల్లడించారు. వాట్సాప్ పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కేంద్రం భావిస్తోందని ఓ రిపోర్టు తెలిపింది.
వాట్సాప్ కొత్త పాలసీ ఫిబ్రవరిలోనే అమల్లోకి రావాలి. అయితే ఆందోళనల నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చింది. మే 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మే నెలలో కేంద్రం ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌కు లేఖ రాసింది. ఆ లేఖపై వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. భారత్ లో అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలతో కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదానికి దారితీశాయి. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలు పూర్తిగా అమలు చేస్తే.. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఐటీ కొత్త నిబంధనలను వ్యతిరికేస్తూ వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది.