Tamannaah : త‌మ‌న్నా మీకు త‌మిళ‌నాడు అబ్బాయిలు న‌చ్చలేదా..? మిల్కీ బ్యూటీ రియాక్ష‌న్ ఏంటంటే..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న అందం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేశారు.

Tamannaah Bhatia

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న అందం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేశారు. గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో అమ్మ‌డి హ‌వా త‌గ్గిన‌ప్ప‌టికి బాలీవుడ్‌లో త‌న‌ని తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ య‌మా బిజీగా ఉంది. గ‌త కొంత‌కాలంగా అమ్మ‌డు న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమ‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Naresh-Pavitra : మరోసారి స్టేజిపై నరేష్, పవిత్ర సందడి.. ముద్దులు, ముద్దు పేరులతో..

ఇదిలా ఉంటే.. త‌మ‌న్నా ఇటీవ‌ల చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ ఈవెంట్‌లో భాగంగా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలో ఫ్యాన్స్‌ ప‌లు ప్ర‌శ్న‌ల‌ను త‌మ‌న్నాను అడుగ‌గా ఆమె స‌మాధానం ఇచ్చారు. నెగెటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు అనే ప్ర‌శ్న ఎదురు కాగా.. వ్య‌తిరేక‌త లేదా విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎందుకిలా జ‌రిగింది అని ఆలోచిస్తాన‌ని చెప్పింది. అయితే.. పొగ‌డ‌డం, విమ‌ర్శించ‌డం అనేవి వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు కాబ‌ట్టి వాటిని తాను పెద్ద‌గా పట్టించుకోన‌ని తెలిపింది.

Ala Ninnu Cheri : డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా.. ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ రిలీజ్

త‌మ‌న్నా మీ పెళ్లి ఎప్పుడు..? త‌మిళనాడుకు చెందిన అబ్బాయిలు మీకు న‌చ్చ‌రా..? అని ఓ ఫ్యాన్ ప్ర‌శ్నించాడు. ఈ ప్ర‌శ్న‌పై మిల్కీ బ్యూటీ ఒకింత అస‌హ‌నానికి గురైంది. త‌న త‌ల్లిదండ్రులు కూడా ఇలా ఎప్పుడు త‌న‌ను అడ‌గ‌లేదంటూ కాస్త సీరియ‌స్‌గానే చెప్పింది. మ‌రీ మీరు కోరుకున్న ల‌క్ష‌ణాలు ఉన్న జీవితంలోకి వ‌చ్చాడా అని ఆమె ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌ను ఉద్దేశిస్తూ మ‌రో ప్ర‌శ్న ఎదురుకాగా.. ప్ర‌స్తుతం త‌న జీవితం సంతోషంగా సాగిపోతుంద‌ని, చాలా ఆనందంగా ఉన్నాన‌ని చెప్పింది. అయితే.. ప్రియుడు విజ‌య్ వ‌ర్మ పేరును మాత్రం చెప్ప‌లేదు.