Tamannaah : బాయ్ ఫ్రెండ్‌తో తమన్నా పెళ్లి.. త్వరలోనే?

తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు. అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Tamannaah Bhatia Vijay Varma Marriage Rumours Goes Viral

Tamannaah Marriage : సీనియర్ హీరోయిన్ తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. వరుసగా సినిమాలు చేస్తుంది. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో తమన్నాపై లవ్ అఫైర్ లాంటి రూమర్స్ రాలేదు. కానీ కొన్ని నెలల క్ర్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉంది అని వార్తలు వచ్చాయి. ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ లీక్ అవ్వగా ఈ విషయం బయటపడింది.

ఆ తర్వాత బాలీవుడ్(Bollywood) లో తమన్నా అండ్ విజయ్ వర్మ(Vijay Varma) కపుల్ హాట్ టాపిక్ అయ్యిపోయారు. ముందుగా వీరిద్దరి ప్రేమ రూమర్లు చక్కర్లు కొట్టడం, ఆ తరువాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో బాగా ట్రెండ్ అయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) వంటి అడల్ట్ సినిమాలో నటించి రొమాన్స్ చేయడంతో మరింత వైరల్ అయ్యారు. ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించి.. అవును మేము ప్రేమలో ఉన్నాం, డేటింగ్ చేస్తున్నాం అని క్లారిటీ ఇస్తూ వారి ప్రేమ గురించి బయట పెట్టారు.

తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు. అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ అంతా కొంచెం లేట్ అయినా ప్రేమించి లేటెస్ట్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. తమన్నా కూడా ఇప్పుడు ఇదే బాటలో వెళ్లనుంది. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ చేతిలో ఉన్న సినిమాల్లో సెట్స్ మీద ఉన్నవి పూర్తి అవ్వగానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

Also Read : Prakash Raj : మళ్ళీ ‘మా’ అసోసియేషన్ రచ్చ.. ఏం చేశారో ఓట్లేసిన వాళ్ళు అడగాలి..

తమన్నాకి ఇప్పుడు 33 ఏళ్ళు, విజయ్ వర్మకు 37 ఏళ్ళు. ఇటీవల తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఎక్కువ ఫోర్స్ చేస్తుండటంతో వారి ప్రేమని పెళ్లి పీటలకు తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఈ జంట. అయితే దీనిపై అధికారికంగా తమన్నా, విజయ్ వర్మ స్పందించలేదు. మరి మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి.