Prakash Raj : మళ్ళీ ‘మా’ అసోసియేషన్ రచ్చ.. ఏం చేశారో ఓట్లేసిన వాళ్ళు అడగాలి..

అప్పట్లోనే ప్రకాష్ రాజ్ ఓడిపోయిన తర్వాత మంచు విష్ణుపై, ఎన్నికల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్నుంచి వాటి గురించి మళ్ళీ మాట్లాడని ప్రకాష్ రాజ్ తాజాగా 'మా' ఎలక్షన్స్ గురించి స్పందించారు.

Prakash Raj : మళ్ళీ ‘మా’ అసోసియేషన్ రచ్చ.. ఏం చేశారో ఓట్లేసిన వాళ్ళు అడగాలి..

Prakash Raj Comments on MAA Association after two Years

Updated On : November 14, 2023 / 8:03 AM IST

Prakash Raj : 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(Movie Artist Association) ఎన్నికలు(Elections) అందరికి గుర్తుండిపోయాయి. మంచు విష్ణు(Manchu Vishnu), ప్రకాష్ రాజ్ రెండు ప్యానల్స్ గా పోటీ చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసి, ప్రచారాలు, హామీలు.. ఇలా సాధారణ ఎన్నికలు రేంజ్ లో జరిగాయి ‘మా’ ఎన్నికలు. ‘మా’ ఎన్నికలు వివాదంగా మారి కొన్ని రోజులు సాగింది. ఇక మంచు విష్ణు గెలవడానికి యాక్టివ్ గా లేని పాత హీరోయిన్స్, మెంబర్స్ ని కూడా ఎక్కడెక్కడ్నుంచో ఫ్లైట్స్ వేసి మరీ తెప్పించి ఓట్లు వేయించుకున్నాడు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో మంచు విష్ణు గెలిచాడు.

మంచు విష్ణు హామీలు గట్టిగానే ఇచ్చాడు. రెండేళ్ల పదవి కాలంలో మా సొంత బిల్డింగ్ కూడా పూర్తి చేస్తా అన్నారు. కానీ అది అవ్వలేదు. రెండేళ్ల కాలం ఆయిపోయింది. అప్పట్లోనే ప్రకాష్ రాజ్ ఓడిపోయిన తర్వాత మంచు విష్ణుపై, ఎన్నికల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

అప్పట్నుంచి వాటి గురించి మళ్ళీ మాట్లాడని ప్రకాష్ రాజ్ తాజాగా ‘మా’ ఎలక్షన్స్ గురించి స్పందించారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు హామీలు నెరవేర్చారా? మీరు మళ్ళీ పోటీ చేస్తారా? అని అడగగా ప్రకాష్ రాజ్ సమాధానమిస్తూ.. హామీలు నెరవేరాయా లేదా అని ఓటు వేసిన వాళ్ళు అడగాలి. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు ఎలాగో అడగలేరు. బయటి నుంచి ఫ్లైట్స్ వేసి తీసుకొచ్చిన వాళ్లకు సంబంధం లేదు. వీళ్ళు తెప్పించుకొని ఓటు వేయించుకొని పంపించారు. ఉన్నవాళ్లు అడగాలి. అలాగే ఏ పెద్దలైతే ఆయన వెనక ఉండి గెలిపించారో వాళ్ళ మనసాక్షికి వాళ్ళైనా అడగాలి. ఆయన్ని ఓడించి నిన్ను గెలిపించాం మరి ఏం చేయలేదు ఏంటి అని వాళ్ళైనా అడగాలి. నేను ఓడిపోయాను, తీర్పు పాటించి బయటకి వచ్చేసాను. ఓటు వేసినవాళ్లు అడగాలి. ఇప్పుడు మళ్ళీ పోటీ చేసేంత టైం నాకు లేదు. నాకు చాలా పనులు ఉన్నాయి అని అన్నారు.

Also Read : Varun Lavanya : పెళ్లి తర్వాత వరుణ్ లావణ్య ఫస్ట్ ఫొటోషూట్.. ఎంత క్యూట్ ఉన్నారో జంట..

దీంతో రెండేళ్ల తర్వాత ప్రకాష్ రాజ్ ‘మా’ అసోసియేషన్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారాయి. మరి దీనిపై ఇప్పటి మా అసోసియేషన్ కానీ, ప్రసిడెంట్ మంచు విష్ణు కానీ స్పందిస్తారేమో చూడాలి.