Tamannaah boy friend Vijay Varma gave paper ad for bride
Tamannaah – Vijay Varma : బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma).. నేచురల్ స్టార్ నాని MCA సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇక ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) వలన సౌత్ లో ఈ నటుడు పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబై వీధుల్లో వీరిద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో బి-టౌన్ లో హాట్ టాపిక్ అయ్యిపోయారు. అయితే వీరిద్దరి రిలేషన్ ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బయట పడింది. విజయ్, తమన్నా ముద్దు పెట్టుకుంటున్న ఒక వీడియో బయటకి రావడంతో వీరిద్దరి ప్రేమ భాగవతం బయటకి వచ్చింది.
Tamannaah : నా తమన్నాతో తిరుగుతున్నావు.. భలే బుద్ధి చెప్పావు.. విజయ్ వర్మ ఫ్రెండ్ వైరల్ కామెంట్స్!
ఇక అక్కడి నుంచి వీరిద్దరూ కూడా ఎక్కడ కనిపించినా జంటగానే దర్శనమిస్తున్నారు. దీంతో తమన్నా, విజయ్ క్లారిటీ ఇవ్వకపోయినా వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అందరు ఫిక్స్ అయ్యిపోయారు. అయితే సడన్ గా విజయ్.. తనకి ‘వధువు కావలెను’ అంటూ ఇచ్చిన పేపర్ యాడ్ అందర్నీ షాక్ కి గురి చేసింది. నిన్న (మే 14) మదర్స్ డే సందర్భంగా విజయ్ తన తల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో విజయ్ తల్లి పేపర్ లో వచ్చిన యాడ్ చూసి తల పట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది.
Tamannaah : ముంబై వీధుల్లో ప్రియుడితో చక్కర్లు కొడుతున్న తమన్నా..
ఆ ఫోటోలకు విజయ్ ఇలా కామెంట్ రాసుకొచ్చాడు.. “కాంపెయిన్ అంతా బాగానే ఉంది. కానీ ఈ వధువు కావలెను ప్రకటన గురించి అమ్మకి ఎలా చెప్పాలో” అని కామెంట్ చేస్తూ ప్రైమ్ వీడియో ఓటిటిని ప్రశ్నించాడు. దానికి ప్రైమ్ వీడియో బదులిస్తూ.. ‘మేము ఆమెకు చెప్పేందుకు ప్రత్నిస్తున్నం’ అంటూ కామెంట్ చేసింది. దీంతో ఇది కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్ అని అర్ధమవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు.. “కొత్త వధువు ఎందుకు బ్రో? తమన్నా ఉంది కదా. టైం వేస్ట్ చేయకుండా మీ అమ్మకి చెప్పేసి పెళ్లి చేసేసుకో” అని కామెంట్స్ చేస్తున్నారు.