Tamannaah: పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనుకుంటున్నా.. తమన్నా!

సౌత్ లో ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం నార్త్ కి చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఒకప్పుడు హిందీలో అరకొర సినిమాలో నటించిన తమన్నా, ఇప్పుడు పూర్తిస్థాయి దృష్టిపెట్టి సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాగా, ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది.

Tamannaah Comments on her Marriage

Tamannaah: సౌత్ లో ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం నార్త్ కి చెక్కేసి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఒకప్పుడు హిందీలో అరకొర సినిమాలో నటించిన తమన్నా, ఇప్పుడు పూర్తిస్థాయి దృష్టిపెట్టి సినిమాలు చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాగా, ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది.

Tamannaah: ఈసారి నేషనల్ అవార్డు గెలుచుకుంటా.. మిల్కీ బ్యూటీ తమన్నా జ్యోష్యం!

మూడు పదుల వయసు దాటిన ఈ అమ్మడు, తాజాగా పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. తాను పెళ్ళికి వ్యతిరేకిని కాదు. ఇన్నాళ్లు సినిమాలో బిజీగా ఉండడంతో, కళ్యాణం గురించి ఆలోచించలేదు. తనకీ పెళ్లి చేసుకొని పిల్లలని కనాలని ఉంటుందని, త్వరలోనే తాను పెళ్లి చేసుకుంటా అంటూ ఆమె మనసులో మాట బయట పెట్టింది మిల్కీ బ్యూటీ.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమాలో నటిస్తుండగా, సత్యదేవ్ తో నటించిన “గుర్తుందా శీతాకాలం” సినిమా చిత్రీకరణ పూర్తీ చేసుకొని విడుదలకు నోచుకోవడం లేదు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఈ అమ్మడు చిరు సరసన మెరబోతుంది.