Tamannaah Hebah Patel Odela 2 Movie Trailer Released
Odela 2 : డైరెక్టర్ సంపత్ నంది కథ, అకోశ్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఓదెల రైల్వేస్టేషన్ మంచి హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా అఘోరాగా కనిపించబోతుంది. హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్ బ్యానర్ పై మధు నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది.
ఇటీవల ఓదెల 2 టీజర్‌ను మహాకుంభమేళాలో రిలీజ్ చేసారు. టీజర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఓదెల 2 ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఓదెల 2 ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఓదెల పార్ట్ 1 సినిమాలో మరణించిన వ్యక్తి ప్రేతాత్మగా మారి తిరిగి వచ్చి ఆ ఊరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు, తమన్నా లేడీ అఘోరాగా వచ్చి శివ శక్తితో ఆ ప్రేతాత్మని ఎలా ఎదుర్కొంది అని ఓదెల 2 సినిమాలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఓదెల 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది.