Tamannaah: ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్.. రచ్చ చేస్తున్న తమ్మూ!

పోయిన చోటే వెతుక్కుంటోంది తమన్నా. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న తమన్నా.. ఆ మధ్య కాస్త స్లో అయినా.. వచ్చిన ప్రతి ఛాన్స్ యూజ్ చేసుకుని మళ్లీ పికప్ అయ్యింది.

Tamannaah (image : Instagram)

Tamannaah: పోయిన చోటే వెతుక్కుంటోంది తమన్నా. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న తమన్నా.. ఆ మధ్య కాస్త స్లో అయినా.. వచ్చిన ప్రతి ఛాన్స్ యూజ్ చేసుకుని మళ్లీ పికప్ అయ్యింది. ఆ మాటకొస్తే ఇప్పుడు మిల్కీ బ్యూటీ జోరు మీదుంది. అప్పుడెప్పుడో 17 ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిల్కీ ఇప్పుడొచ్చే యంగ్ హీరోలకు కూడా సరిపడేలా బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఇటు స్మాల్ స్క్రీన్ లో బిజీగా ఉంటూనే సినిమాల్లో కూడా బాగా హడావిడిచేస్తోంది.

Shruti Haasan-Tamannaah: సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న హీరోయిన్లు

ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సౌత్ లో సూపర్ సక్సెస్ అయిన తమన్నా.. ఆ మధ్య కాస్త జోరు తగ్గింది. దీంతో తమన్నా పనైపోయిందనుకున్నారు. కానీ.. తమ్మూ మాత్రం అంతకు మించి ఉత్సాహంతో ఇప్పుడు దూసుకెళ్తుంది. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు బాలీవుడ్ లో అమ్మడు ఇప్పుడు మాంచి జోరుమీదుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్ 3 సినిమాతో పాటు, గుర్తుందా శీతాకాలం, మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ వరుణ్ తేజ్ గని సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా చిందిలేస్తుంది.

Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..

హిందీలో కూడా అంతకు మించి భారీ సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇప్పటికే బోలె చూడియా, ప్లాన్‌ ఎ ప్లాన్ బి చిత్రాల్లో నటిస్తోన్న తమన్నా.. తాజాగా ‘బబ్లీ బౌన్సర్‌‌’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ కమిటయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు మధుర్‌‌ భండార్కర్. ఆయన దర్శకత్వంలో బబ్లీ బౌన్సర్‌‌ తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టగా.. ప్లాన్‌ ఎ ప్లాన్ బి సినిమాకు పార్లర్ గా బబ్లీ బౌన్సర్‌‌ కూడా పూర్తి చేసే పనిలో ఉంది తమన్నా. రీసెంట్‌గా రిలీజైన ‘తబాహీ’ అనే సాంగ్ తో గ్లామర్‌‌ విత్ డాన్స్ తో ఇరగదీసిన తమన్నాను తట్టుకోవడం కష్టమేమో అనేలా దూసుకెళ్తుంది.