tamanna shares a video worships linga bhairavi godess
Tamannaah : తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అవుతున్నా హీరోయిన్ గా ఇంకా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. ప్రస్తుతం తమన్నా చేతిలో తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు దాదాపు అరడజను వరకు ఉన్నాయి. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటున్న తమన్నా ఖాళీ దొరికితే ఇటీవల ఎక్కువగా విహారయాత్రలకు వెళ్తుంది. తాజాగా తమన్నా కోయంబత్తూర్ లోని లింగ భైరవి ఆలయానికి వెళ్ళింది.
ఇషా సద్గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తుంది. తాజాగా ఈ ఆలయానికి విచ్చేసిన తమన్నా కాషాయ రంగు చీరలో అమ్మవారికి పూజలు నిర్వహించింది. ధ్యానం చేసింది. ఆలయంలో తమన్నా పూజలు, లింగభైరవి అమ్మవారి గురించి చెప్పిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
MX Player-Amazon Prime : MX ప్లేయర్ ఓటీటీని అమెజాన్ కొంటుందా?
ఈ వీడియోలో.. ఇక్కడి లింగభైరవి ఆలయానికి ఇషా సద్గురు ఆహ్వానం మేరకు వచ్చాను, ఇక్కడ అమ్మవారిని దర్శించి, పూజలు చేశాను. ఇక్కడికి వచ్చాక నాకు ప్రశాంతత చేకూరింది. లైఫ్, భయాలు, మరణం, ఫెయిల్యూర్స్.. లాంటి వాటికి ఇక్కడ ఉంటే భయం తగ్గుతుంది. చాలా సంతోషంగా ఉన్నాను అమ్మవారిని దర్శించుకున్నాక. లింగ భైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్నాను అని తెలిపింది. తమన్నా ఇలా పూజలు చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.