Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో విలన్ జగపతి బాబు ‘‘ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది’’ అనే ఓ డైలాగ్ చెప్తాడు. ఆ ఒక్క ఊరు వదిలేయకపోవడం...

Tamannaah Shocking Comments On Her Bollywood Career
Tamannaah: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో విలన్ జగపతి బాబు ‘‘ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది’’ అనే ఓ డైలాగ్ చెప్తాడు. ఆ ఒక్క ఊరు వదిలేయకపోవడం తన పతనానికి కారణంగా గుర్తిస్తాడు. ఇలాంటివి రియల్ లైఫ్‌లోనూ జరగుతాయని మీకు తెలుసా.. అది కూడా ఓ మామూలు వ్యక్తి జీవితంలో కాదు.. ఓ సెలబ్రిటీ విషయంలో ఇలాంటి ఘటన ఎదురయ్యిందంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. అయితే ఇక్కడ ఈ సెలబ్రిటీ విషయంలో వదిలేయాల్సింది ఒక్క ఊరును కాదు.. ఒక్క సినిమాను. ఆ ఒక్క సినిమా సదరు సెలబ్రిటీకి అసలు ఆమె కోరుకున్న ఇండస్ట్రీలో తనకు కెరీర్ లేకుండా చేసింది. ఇంతకీ ఈ సెలబ్రిటీ ఎవరు.. అసలు ఈ ఒక్క సినిమా కథ ఏమిటో తెలుసుకుందామా..!
Tamannaah Bhatia : కాన్స్ చిత్రోత్సవంలో తమన్నా తళుకులు..
టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అందాల భామ తమన్నా, ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతూ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అయితే అమ్మడు ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలని అక్కడ ఓ స్టార్ హీరోతో సినిమా చేసింది. కానీ అమ్మడి దురదృష్టం ఆమెకు బాలీవుడ్‌లో కెరీర్ లేకుండా చేసింది. హిందీ నటుడు అజయ్ దేవ్గన్ హీరోగా హిమ్మత్‌వాలా అనే సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలో తమన్నా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉండటంతో, ఆ సినిమాపై ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది.
Tamannaah: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమన్నా కొత్త మూవీ
దీంతో తమన్నా బాలీవుడ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ సినిమా దెబ్బకు బాలీవుడ్‌లో తమన్నాకు ఒక్కటంటే ఒక్క మంచి గుర్తింపు ఉన్న సినిమా కూడా పడలేదు. ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే, ఇతర హీరోతో సినిమా చేసి, తాను బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఉండేదాన్ని అంటూ అమ్మడు ఇప్పుడు బాధపడుతోంది. ఏదేమైనా కొన్నిసార్లు సినిమాల్లో కనిపించే సీన్స్, చెప్పే డైలాగులు మనకు రియల్ లైఫ్‌లోనూ కనిపిస్తుండటం విశేషం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎఫ్3 చిత్రంతో సౌత్ ఆడియెన్స్‌ను మరోసారి అలరించేందుకు మిల్కీ బ్యూటీ రెడీ అయ్యింది.