Tamannaah : అభిమాని అత్యుత్సాహం.. త‌మ‌న్నాపై నెటీజ‌న్ల‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ఏం చేసిందంటే..?

సినీతార‌ల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వారు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీప‌డుతుంటారు. ఒక్కొసారి ఫ్యాన్స్ చేసే ప‌నుల వ‌ల్ల‌ తార‌లు ఇబ్బంది ప‌డిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి.

Tamannaah : అభిమాని అత్యుత్సాహం.. త‌మ‌న్నాపై నెటీజ‌న్ల‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం.. ఏం చేసిందంటే..?

Tamannaah

Updated On : August 6, 2023 / 9:38 PM IST

Tamannaah fan : సినీతార‌ల‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వారు ఎక్క‌డ క‌నిపించినా స‌రే వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీప‌డుతుంటారు. ఒక్కొసారి ఫ్యాన్స్ చేసే ప‌నుల వ‌ల్ల‌ తార‌లు ఇబ్బంది ప‌డిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇక మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా(Tamannaah) గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ త‌న‌దైన గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవ‌ల కేరళలోని కొల్లాంకు వెళ్లిన త‌మ‌న్నాకు ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది.

కొల్లాంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి త‌మ‌న్నా వెళ్లింది. మిల్కీ బ్యూటీ వ‌స్తున్న విష‌యం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్య‌లో అక్క‌డ‌కు వ‌చ్చారు. ప్రారంభోత్స‌వం అనంత‌రం మెట్లు దిగి త‌న కోసం వ‌చ్చిన అభిమానుల‌కు హాయ్ చెబుతూ వెలుతుండ‌గా ఓ అభిమాని అక్క‌డ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను దూకి త‌మన్నా చుట్టూ ఉన్న బౌన్స‌ర్ల‌ను త‌ప్పిచుకుని ఏకంగా మిల్కీ బ్యూటీ చేయి ప‌ట్టుకున్నాడు.

Hyper Aadi : మెగా ఫ్యామిలీని విమర్శించే వారికీ హైపర్ ఆది పంచ్.. కుర్చీ మడత పెట్టి..

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన బౌన్స‌ర్లు అత‌డిని ప‌క్క‌కు లాగేశారు. అభిమాని ఉత్సాహాన్ని గ‌మ‌నించిన త‌మ‌న్నా బౌన్స‌ర్ల‌కు న‌చ్చ‌జెప్పి అభిమానితో క‌ర‌చాల‌నం చేసింది. అత‌డితో ఓ సెల్ఫీ దిగి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. అత‌డి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆనందంలో అత‌డు గెంతులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మ‌న్నా చేసిన ప‌నిపై నెటీజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మీరు చేసిన ప‌ని గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. త‌మ‌న్నా న‌టించిన రెండు భారీ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్‌లో విడుద‌ల కానున్నాయి. ర‌జినీకాంత్ స‌ర‌స‌న జైల‌ర్ చిత్రంలో న‌టించ‌గా ఈ సినిమా ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న భోళా శంక‌ర్ చిత్రంలోనూ న‌టించింది. ఈ సినిమా ఆగ‌స్టు 11న విడుద‌ల కానుంది.

Tamannaah : తమన్నాని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటున్న చిరు.. వాళ్ళ నాన్నకు సర్జరీ జరిగినా..?