Chiyaan Vikram: తమిళ్ హీరో విక్రమ్‌కు హార్ట్‌ఎటాక్.. కావేరీ ఆస్పత్రిలో చికిత్స
ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చింది.

Vikram Hospitalized
Chiyan Vikram : ప్రముఖ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండెపోటు వచ్చింది. ఈరోజు ఉదయం ఆయనకు గుండె పోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్-1 సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం చెన్నైలో రిలీజ్ కానుంది. ఆ కార్యకమానికి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. విక్రమ్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్-1 పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. సెప్టెంబర్ 3న దక్షిణాదిభాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.