Mahalakshmi: భ‌ర్త‌కు విడాకులిచ్చిన బుల్లితెర న‌టి..? ఒక్క ఫోటోతో మొత్తం సంగ‌తి చెప్పేసిందిగా

కోలీవుడ్ బుల్లితెర న‌టి మ‌హాల‌క్ష్మీ(Mahalakshmi), ప్రొడ్యూస‌ర్ రవీంద్ర చంద్రశేఖరన్‌(Ravindra Chandrasekaran)లు 2022 సెప్టెంబ‌ర్ 1న వివాహాం చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లిపై భారీగా ట్రోలింగ్ న‌డిచింది.

Mahalakshmi-Ravindra Chandrasekaran

Mahalakshmi-Ravindra Chandrasekaran: సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అస‌లు వార్త ఏదో న‌కిలీ వార్త ఏదో క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం మారింది. ఇక సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన వార్త‌లు అయితే క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఫ‌లానా న‌టి ఆ హీరోతో డేటింగ్‌లో ఉంద‌నో, ఆ న‌టుడు చ‌నిపోయాడ‌నో, ఆ సెల‌బ్రెటీ జంట విడాకులు తీసుకుంద‌నే వార్త‌లు వ‌స్తుంటాయి. అయితే.. ఆ వార్త‌ల‌కు సంబంధించిన న‌టీ లేదా న‌టుడు స్పందిస్తే త‌ప్ప అందులో నిజం ఎంత ఉందో అర్థం కావ‌డం లేదు.

కోలీవుడ్ బుల్లితెర న‌టి మ‌హాల‌క్ష్మీ(Mahalakshmi), ప్రొడ్యూస‌ర్ రవీంద్ర చంద్రశేఖరన్‌(Ravindra Chandrasekaran)లు 2022 సెప్టెంబ‌ర్ 1న వివాహాం చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లిపై భారీగా ట్రోలింగ్ న‌డిచింది. ఇందుకు కార‌ణం న‌టి చూడ‌డానికి స్లిమ్‌గా అందంగా ఉండ‌గా, రవీంద్ర మాత్రం భారీకాయంతో క‌నిపిస్తుంటాడు. దీంతో మ‌హాల‌క్ష్మీ డ‌బ్బు కోస‌మే అత‌డిని పెళ్లి చేసుకుంద‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి. పైగా వీరిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా ఇద్ద‌రికి ఇది రెండో వివాహం కావ‌డం గ‌మ‌నార్హం.

Karate Kalyani: మా సభ్యత్వం రద్దుపై స్పందించిన క‌రాటే క‌ళ్యాణి.. న్యాయ‌పోరాటం చేస్తా

త‌మ పెళ్లిపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఈ జంట ప‌ట్టించుకోలేదు. అప్పుడ‌ప్పుడూ మ‌హాల‌క్ష్మీ త‌న భ‌ర్త ర‌వీంద్ర‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తూ త‌మ‌ను ట్రోలింగ్ చేసే వారి నోరును మూయిస్తూనే ఉంది. అయితే.. ఇటీవ‌ల వీరిద్ద‌రు విడిపోయారు అంటూ కొన్ని యూట్యూబ్ ఛాన‌ళ్లు క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయి. ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు ఫోటోలో షేర్ చేసి అవి అబ‌ద్దం అని చెప్పే న‌టి మ‌హాల‌క్ష్మీ సైతం స్పందించ‌క‌పోవ‌డంతో దీంతో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు అని చాలా మంది ఫిక్స్ అయ్యారు.

Adah Sharma: నెటీజ‌న్ ట్వీట్‌కు స్పందించిన ఆదా శ‌ర్మ‌.. మీరు అరుదైన అద్భుతం అంటూ..

అయితే.. తాజాగా అలాంటిది ఏమీ లేద‌ని తెలిసింది. వీరిద్ద‌రు క‌లిసే ఉన్నారు. ఈ విష‌యాన్ని మ‌హాల‌క్ష్మీ ఒక్క ఫోటోతో చెప్పింది. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నువ్వు భుజాల‌పై చేతులు వేసిన‌ప్పుడు నేను ఈ ప్ర‌పంచంలో దేనినైనా సాధించ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌కం వ‌స్తుంది. నా మ‌న‌సు నిండా నువ్వే అమ్ము ఐ ల‌యూ అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది. దీనికి ర‌వీంద్ర సైతం ల‌వ్ యూ అంటూ రిప్లై ఇచ్చాడు. ఒక్క ఫోటోతో వీరి విడాకులపై వ‌స్తున్న రూమ‌ర్లు చెక్ పెట్టారు.