Sruthi Shanmuga Priya : ప్రేమ పెళ్లి.. పెళ్ళైన సంవత్సరానికే గుండెపోటుతో భర్త మృతి.. తీవ్ర విషాదంలో నటి..

అనేక సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతి షణ్ముగప్రియ. వెయిట్ లాస్ ట్రైనర్, బాడీ బిల్డర్ అరవింద్ ని ప్రేమించి కొన్నాళ్ళు డేట్ చేసి గతేడాది పెళ్లి చేసుకుంది శృతి షణ్ముగప్రియ.

Sruthi Shanmuga Priya : ప్రేమ పెళ్లి.. పెళ్ళైన సంవత్సరానికే గుండెపోటుతో భర్త మృతి.. తీవ్ర విషాదంలో నటి..

Tamil Actress Sruthi Shanmuga Priya Husband Arvind Shekar Passed away

Updated On : August 4, 2023 / 1:44 PM IST

Sruthi Shanmuga Priya : ఇటీవల సినీ, టీవీ పరిశ్రమలలో పలువురు ప్రముఖులు మరణిస్తూ పరిశ్రమలో విషాదం నింపుతున్నారు. తాజాగా తమిళ టీవీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ్ లో అనేక సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతి షణ్ముగప్రియ. వెయిట్ లాస్ ట్రైనర్, బాడీ బిల్డర్ అరవింద్ ని ప్రేమించి కొన్నాళ్ళు డేట్ చేసి గతేడాది పెళ్లి చేసుకుంది శృతి షణ్ముగప్రియ. ఎన్నో కలలతో జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు. కానీ శృతి షణ్ముగప్రియ భర్త అరవింద్ హఠాత్తుగా మరణించాడు.

ఆగస్టు 2న అరవింద్ కి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అరవింద్ మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు శృతి షణ్ముగప్రియ, కుటుంబ సభ్యులు. ప్రేమించి పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా కాకముందే ఇలా అరవింద్ చనిపోవడంతో శృతి షణ్ముగప్రియ, వారి కుటుంబ సభ్యులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

Pawan Kalyan – Trivikram : పవన్ కళ్యాణ్ వర్సెస్ త్రివిక్రమ్.. సంక్రాంతికి స్నేహితుల మధ్య ఫైట్..?

శృతి షణ్ముగప్రియ, అరవింద్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఎప్పుడూ హ్యాపీగా ఉండేవారు. రీల్స్, ఫొటోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేసేవారు. ఎంతో ఆనందంగా ఉన్న వీరి లైఫ్ ని విధి ఇలా మార్చేసింది. అరవింద్ కి సంతాపం తెలుపుతూ శృతి షణ్ముగప్రియకు ధైర్యం చెప్తున్నారు పలువురు ప్రముఖులు, నెటిజన్లు. ఇక శృతి కూడా తన నుంచి భౌతికంగా దూరమైనా నేను చనిపోయే వరకు నా పక్కనే ఉంటావు అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.