ARI
ARI : పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయశంకర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ‘అరి’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా హిందీలో అభిషేక్ బచ్చన్, తమిళంలో శివ కార్తికేయన్ రీమేక్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
RC16 : చరణ్ సినిమాలో నటించే అవకాశం.. బుచ్చిబాబు స్పెషల్ వీడియో తప్పక చూడండి..
వి.జయశంకర్ డైరెక్ట్ చేసిన సినిమా పేపర్ బాయ్ సినిమా హీరో సంతోష్ శోభన్ కు .. జయశంకర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత జయశంకర్ చేస్తున్న ‘అరి’ కూడా వినూత్నంగా తీసారు. అరిషడ్వర్గాలలోని కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. మార్చి 12, 2023న న రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ రీమేక్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Vishal : విజయ్ బాటలోనే విశాల్.. కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీపై ఏమన్నారంటే?
అరి సినిమాను తమిళంలో శివ కార్తికేయన్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆ మధ్య జయశంకర్ ను కలిసిన శివ కార్తికేయన్ అరి సినిమాపై చర్చించారని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్ అరి మీద ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాట ‘చిన్నారి కిట్టయ్యా సిత్రాల కిట్టయ్యా’కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది.