Vishal : విజయ్ బాటలోనే విశాల్.. కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీపై ఏమన్నారంటే?
విజయ్ బాటలో విశాల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారా? అందుకే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?

Vishal
Vishal : దళపతి విజయ్ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటన చేయగానే.. మరో హీరో విశాల్ సైతం రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై విశాల్ క్లారిటీ ఇచ్చారు.
Eagle : ‘ఈగల్’ క్లైమాక్స్ ఎవరు ఊహించిన విధంగా ఉంటుందట.. పవన్ కళ్యాణ్‌తో..
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఏ ఇండస్ట్రీ చూసినా అనేకమంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చారు. కొందరికి లక్ కలిసొచ్చి ఉన్నత పదవులు చేపట్టి రాజకీయాల్లోనే సెటిల్ అయ్యారు. తాజాగా దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన చేసారు. తాను ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతానంటూ క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పుడు విజయ్ బాటలో విశాల్ కూడా నడుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై విశాల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తనకా ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Operation Valentine : ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి ‘గగనాల’ సాంగ్ రిలీజ్
విశాల్ నిత్యం ప్రజా సేవలో ఉంటారు. తన ఫ్యాన్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాలు మరింత పెద్దగా చేపట్టాలని నిర్ణయించుకున్నారట విశాల్. నియోజకవర్గాలకే పరిమితం చేయకుండా జిల్లాల వారీగా ప్రజలకు అవసరమైన సేవ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే తల్లి పేరు మీద ఉన్న దేవీ ఫౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్ధుల చదువుల కోసం విశాల్ సాయం అందిస్తున్నారు. దీంతో ఇదంతా రాజకీయరంగ ప్రవేశానికే అంటూ వార్తలు వచ్చాయి. తన ఫ్యాన్ క్లబ్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదని విశాల్ వెల్లడించారు. అయితే భవిష్యత్తు సంగతి ఇప్పుడు చెప్పలేనని చెప్పారు. ఈ అంశాలపై విశాల్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన లేఖ వైరల్ అవుతోంది.
அன்புடையீர் வணக்கம் pic.twitter.com/WBkGmwo2hu
— Vishal (@VishalKOfficial) February 7, 2024