Eagle : ‘ఈగల్’ క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందట.. పవన్ కళ్యాణ్‌‌తో..

'ఈగల్' క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందంటూ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్‌‌తో..

Eagle : ‘ఈగల్’ క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందట.. పవన్ కళ్యాణ్‌‌తో..

TG Vishwa Prasad interesting comments on Raviteja Eagle climax and pawan kalyan

Updated On : February 7, 2024 / 2:48 PM IST

Eagle : రవితేజ నటిస్తున్న ‘ఈగల్’ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని నటీనటులతో పాటు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత.. ఆసక్తికర కామెంట్స్ చేసి మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు పెంచేశారు. ఈ మూవీ క్లైమాక్స్ ఎవరు ఊహించిన విధంగా ఉంటుందట.

ఎక్కువగా చెప్పడం కాదు గాని, చివరి 40 నిముషాలు అయితే ఓ రేంజ్ లో ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో చూడని క్లైమాక్స్ ఈగల్ లో చూస్తారట. బాహుబలితో పోల్చడం కాదు గానీ, ఆ మూవీ క్లైమాక్స్ ఎలా ఉంటుందో.. అదే రేంజ్ లో క్లైమాక్స్ ఉంటుందట. కానీ అది లోకేష్ కనకరాజు చూపించే స్టైల్లో ఉంటుందని నిర్మాత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Gautham Krishna : బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా సినిమా అనౌన్స్.. ఫస్ట్ లుక్ అదుర్స్..

ఇక ఈ మూవీ ప్రొడక్షన్ విషయం గురించి కూడా నిర్మాత చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. 100 కోట్ల ఖర్చు పెట్టి అద్భుతమైన క్వాలిటీ రప్పించడం కాకుండా, తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే అవుట్ ఫుట్ ని ఈ సినిమాలో తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

అలాగే తమ నిర్మాణంలో రాబోయే ప్రాజెక్ట్స్ గురించి కూడా ఆడియన్స్ కి అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం మొత్తం 15 ప్రాజెక్ట్ లు ఉన్నాయట. ఈ చిత్రాలు అన్నిటిని నెలకొక దానిని రిలీజ్ చేసుకుంటూ వస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఈ పదిహేను ప్రాజెక్ట్స్ లో సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు సినిమాలతో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకరి ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ.

అలాగే పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా ఉంటుందట. పవన్ ఎప్పుడు ఫ్రీ అయితే.. అప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకి డేట్స్ ఇస్తానని మాట ఇచ్చారట. పవన్‌కి, తమకి అంతటి సంబంధం ఉందని నిర్మాత చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ లో కొనసాగుతున్న ఈ నిర్మాత.. త్వరలో థియేటర్ బిజినెస్‌, స్టూడియో ప్లానింగ్స్, ఫిల్మ్ అకాడమీ కూడా పెట్టే ఆలోచన ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తమకి కావాల్సిన టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ ని తమ అకాడమీ నుంచే రెడీ చేసుకోనున్నారట.