RC16 : చరణ్ సినిమాలో నటించే అవకాశం.. బుచ్చిబాబు స్పెషల్ వీడియో తప్పక చూడండి..

చరణ్ సినిమాలో నటించాలని ఉందా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారా? అయితే డైరెక్టర్ బుచ్చిబాబు షేర్ చేసిన వీడియో చూడండి.

RC16 : చరణ్ సినిమాలో నటించే అవకాశం.. బుచ్చిబాబు స్పెషల్ వీడియో తప్పక చూడండి..

RC16

Updated On : February 7, 2024 / 2:53 PM IST

RC16 : చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పనులు స్పీడ్ అందుకున్నాయి. సినిమా ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గర ఉండటంతో అక్కడి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని మూవీ టీమ్ భావించింది. అందులో భాగంగా నటీనటులు సెలక్షన్స్ కోసం ఆడిషన్స్ చేపట్టింది టీమ్. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియోతో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Tollywood : షూటింగ్‎లో స్పీడ్ పెంచిన టాలీవుడ్ పెద్ద హీరోలు..

చరణ్-బుచ్చిబాబుల సినిమా RC16 ఇంకా పట్టాలెక్కలేదు. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం కూడా అందుకు కారణం. కాగా ఇటీవల RC16 సినిమా పనులు వేగవంతం చేసింది టీమ్. ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గరగా వస్తున్న సినిమా కావడంతో సహజత్వం కోసం ఆ ప్రాంతానికి చెందిన నటీనటులను ఎంపిక చేయాలని టీమ్ భావిస్తోంది. అందులో భాగంగా ఆడిషన్స్ చేపట్టారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Seerat Kapoor : స్టైలిష్ లుక్స్‌తో అదుర్స్ అనిపిస్తున్న సీరత్ కపూర్..

రామ్ చరణ్ తో తీయబోతున్న సినిమా ఉత్తరాంధ్రని బేస్ చేసుకుని తీస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన పిల్లలు, పెద్దలు.. అనుభవం ఉన్నవారు.. లేనివారు ఎవరైనా సరే వచ్చి అవకాశం సద్వినియోగం చేసుకోండి అంటూ బుచ్చిబాబు తన వీడియోలో పిలుపునిచ్చారు. ముఖ్యంగా విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, నెలిమర్ల, బొబ్బిలి, రాయగడ్డ ఏరియాలలో ఉన్న వాళ్లెవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పారు. చాలా అథెంటిక్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నామని.. మూవీకి రియల్ ఫీల్ రావాలని టీమ్ అంతా 12 రోజులుగా అక్కడే ఉండి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని బుచ్చిబాబు చెప్పారు. నిజంగానే సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హీరో టైగర్ ఫ్రాఫ్ విలన్‌గా కనిపించనున్నట్లు టాక్. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తారని అంటున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా ఖరారైనట్లు ఆమెతో పాటు నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని మరో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. పూర్తి వివరాలు బుచ్చిబాబు టీమ్ వెల్లడించాల్సి ఉంది.