Tamil Comedian Actor Manobala Passes Away
Actor Manobala: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ యాక్టర్, డైరెక్టర్ మనోబాల కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. తమిళంలో యాక్టర్‌గా, డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మనోబాల.. అనేక సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.
Viral News: వధూవరులకు పెట్రోల్ కానుకిచ్చిన తమిళ కమెడియన్!
గతకొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోబాల, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జనవరిలో యాంజియో చికిత్స తీసుకున్న మనోబాల, అప్పటి నుండి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాగా, ఆయన తాజాగా మృతిచెందినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమిళ దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన మనోబాల, ఆ తరువాత దర్శకుడిగా మారి అనేక సినిమాలు చేశారు. అటుపై నటుడిగా, తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నిర్మాతగా కూడా మనోబాల పలు సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు. సూర్య నటించిన ‘గజిని’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ వర్సటైల్ యాక్టర్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో జడ్జి పాత్రలో మనోబాల నటించారు. మనోబాల మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మనోబాలకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
#BREAKING : Actor / Director #Manobala has passed away sometime back..
Shocking!
RIP! pic.twitter.com/SLA2McczXY
— Ramesh Bala (@rameshlaus) May 3, 2023