TFAPA : సినీ పరిశ్రమ కోసం ఇవన్నీ చేయండి.. తమిళనాడు ప్రభుత్వానికి సినీ నిర్మాతల రిక్వెస్ట్..

తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పలు కోరికలు ప్రభుత్వానికి విన్నవించారు.

Tamil Film Active Producers Association Press Meet Requests to Tamilanadu Government

Tamil Film Active Producers Association : తమిళ సినీ పరిశ్రమలో ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ నిర్మాతల మండలి ఇటీవల పలు కొత్త కొత్త నిర్ణయాలని ప్రకటిస్తూ అమలుపరుస్తుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళ సినీ పరిశ్రమ కోసం పలు పనులు చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు నిర్మాతలు. తమిళనాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తాజాగా ఓ ప్రెస్ మీట్ పెట్టి తమిళ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పలు కోరికలు ప్రభుత్వానికి విన్నవించారు.

తమిళ నిర్మాతల మండలి తమిళనాడు ప్రభుత్వాన్ని అడిగిన విన్నపాలు ఇవే..

ప్రస్తుతం సింగిల్ థియేటర్స్ లో రోజుకు నాలుగు షోలు వేస్తుండగా వాటినుండి అయిదు షోలకు పెంచాలని, ఉదయం 9 నుంచి రాత్రి 1.30 వరకు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

చెన్నైలోని తారామణి ఏరియా వద్ద షూటింగ్స్ కోసం ఫిలిం సిటీ కట్టాలి. వీలైనంత త్వరగా పని మొదలుపెట్టాలి.

కనీసం 25 వేల మంది పట్టేలా ఒక పెద్ద ఆడిటోరియం నిర్మించాలి. సినిమా, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కి ఉపయోగపడేలా నిర్మించాలి.

తమిళనాడులో ఉన్న 1150 థియేటర్స్ ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి సెంట్రలైజ్ బాక్స్ ఆఫీస్ చేసి కలెక్షన్స్ లెక్కలు పక్కాగా వచ్చేలా ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి.

చెన్నైలో ఉదయం పూట సినిమా షూటింగ్స్ కి త్వరగా పర్మిషన్స్ ఇవ్వాలి.

సెన్సార్ సర్టిఫికెట్ కోసం చెన్నై, ముంబైకి తిరుగుతున్నాం. కనీసం అయిదు రోజులు పడుతుంది. కేంద్రప్రభుత్వం ఇచ్చే సెన్సార్ సర్టిఫికెట్ కూడా చెన్నైలోనే ఇవ్వాలి. రెండు రోజుల్లో పని అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ఓటీటీలు, శాటిలైట్ ఛానల్స్ పెద్ద సినిమాలని మాత్రమే ముందుగా కొనుక్కుంటున్నాయి. చిన్న సినిమాలని కనీసం పే పర్ వ్యూ పద్దతిలో అయినా కొనుక్కోవాలి. అప్పుడు చిన్న నిర్మాతలకు కూడా బెనిఫిట్ అవుతుంది.

Also Read : Chandrabose : ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఘన సత్కారం.. తెలుగు అక్షరమాల దండతో..

ఈ అంశాలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఇవన్నీ జరిగేలా చూస్తామని ప్రెస్ మీట్ లో తమిళ నిర్మాత మండలి తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు