Jayam Ravi : పండగ పూట పేరు మార్చుకున్న స్టార్ హీరో.. తన ఫ్యాన్స్ క్లబ్స్ అన్ని కలిపి కొత్తగా..

తాజాగా జయం రవి తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించి మరికొన్ని విషయాలు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ లెటర్ విడుదల చేశారు.

Tamil Hero Jayam Ravi Changed his Name and Announced New Production House

Jayam Ravi : తమిళ్ స్టార్ హీరో జయం రవి తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా పేరు తెచ్చుకున్నాడు. సీనియర్ ఎడిటర్ మోహన్ కొడుకుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రవి మన తెలుగు జయం సినిమాని తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టడంతో జయం రవిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే తన భార్యతో విడాకుల విషయంలో వార్తల్లో నిలిచాడు.

తాజాగా జయం రవి తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించి మరికొన్ని విషయాలు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఓ లెటర్ విడుదల చేశారు.

Also Read : Nidhhi Agerwal : నిధి అగర్వాల్ పొద్దున్నే తినే టిఫిన్ ఏంటో తెలుసా? మన పూర్వికులు అలాగే తినేవాళ్లు..

ఈ లెటర్ లో జయం రవి.. ఈ కొత్త సంవత్సరంలో నా జీవితంలో కొత్త విషయాలు మొదలుపెట్టబోతున్నాను. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సినిమా అనేది నా ఫ్యాషన్. అదే నన్ను ఇక్కడ నిలబెట్టింది. మీ అందరి సపోర్ట్ ఇచ్చింది. ఇకపై అందరూ నన్ను రవి లేదా రవి మోహన్ అనే పిలవండి. ఇకపై నన్ను జయం రవి అని పిలవకండి. ఇది నా రిక్వెస్ట్. రవి మోహన్ స్టూడియోస్ స్థాపించి సరికొత్త కథలను సినిమాల రూపంలోకి మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నా ఫ్యాన్స్ కి నేనిచ్చే మెసేజ్ ఏంటంటే.. నాకున్న అన్ని ఫ్యాన్స్ క్లబ్స్ ని కలుపుతూ రవి మోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్ అనే సంస్థగా మారుస్తున్నాను. దీని ద్వారా సేవా సహాయ కార్యక్రమాలు, సొసైటీలో మంచిని పెంపొందించడం చేస్తాను. నా ఈ కొత్త జర్నీలో మీ అందరూ నాకు సహకరించండి అని తెలిపారు.

దీంతో జయం రవి పోస్ట్ వైరల్ గా మారింది. తన పేరు కేవలం రవినే. జయం హిట్ తర్వాత జయం రవిగా మారగా ఇప్పుడు వల్ల నాన్న మోహన్ పేరు జత చేసుకొని రవి మోహన్ గా మార్చుకున్నట్టు ప్రకటించాడు. అలాగే నిర్మాతగా కూడా మారి సినిమాలు తీయబోతున్నట్టు ప్రకటించాడు. మరి తన ఫ్యాన్స్ ఫౌండేషన్ తో మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో చూడాలి.

Also Read : Game Changer Piracy : డబ్బులివ్వకపోతే లీక్ చేస్తామని బెదిరించారు.. ‘గేమ్ ఛేంజర్’ పైరసీ చేసిన వాళ్లపై.. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు..

ఇటీవల కొన్ని నెలల క్రితం జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు, పరస్పర అంగీకారంతోనే తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. కానీ జయం రవి భార్య ఆర్తి మాత్రం నాకు తెలియకుండానే ఆ పోస్టు పెట్టారు అంటూ భర్తపై ఆరోపణలు చేసింది. దీంతో వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతానికి వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు, వీరి విడాకుల కేసు కోర్టులో ఉన్నట్టు సమాచారం.