Nidhhi Agerwal : నిధి అగర్వాల్ పొద్దున్నే తినే టిఫిన్ ఏంటో తెలుసా? మన పూర్వికులు అలాగే తినేవాళ్లు..
చాన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తను ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్ట్ గురించి చెప్పింది.

Do You Know about Actress Nidhhi Agerwal Break Fast Details Here
Nidhhi Agerwal : హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉంది. చాన్నాళ్ల తర్వాత నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తను ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్ట్ గురించి చెప్పింది.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నాకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో పట్టింపులేం లేవు. అన్ని తినేదాన్ని. కానీ పొద్దున్నే చద్దన్నం తినడం చాలా ఇష్టం. రాత్రి మిగిలిన అన్నంలో నీరు లేదా మజ్జిగ పోసి పర్చిమిర్చి, ఉప్పు వేసుకొని తింటాను. అదే నాకు బ్రేక్ ఫాస్ట్. కన్నడలో దీన్ని కంజి అంటారు అని తెలిపింది. అలాగే చద్దన్నం కంటే ముందు రకరకాల ఫుడ్స్ ట్రై చేశాను, ఎగ్స్ కూడా తినేదాన్ని బ్రేక్ ఫాస్ట్ కోసం. కానీ ఇది బెటర్ అనిపించింది అని తెలిపింది. కానీ తన ఫేవరేట్ ఫుడ్ ఇడ్లీ అని చెప్పింది.
ఇప్పుడంటే ఇడ్లీ, దోస, గారె.. అని ఇలా రకరకాల ఐటమ్స్ వచ్చాయి కానీ గతంలో అందరూ చద్దన్నం, అంబలి, రాగి జావ.. లాంటివే తినేవాళ్లు, తాగేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం కోసం మళ్ళీ అదే ఫుడ్ తింటున్నారు కొంతమంది. సాధారణంగా హీరోయిన్స్ అంటే తమ అందాన్ని, బాడీని మెయింటైన్ చేయడానికి న్యూట్రీషియన్స్ చెప్పిన ఫుడ్ తింటారు అనుకుంటారు కానీ నిధి అగర్వాల్ ఇలా చద్దన్నం తింటాను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
నిధి అగర్వాల్ హైదరాబాద్ లో పుట్టిన అమ్మాయి అయినా బెంగుళూరులోనే చదువుకొని అక్కడే పెరిగింది. నిధి తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో.. సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ప్రభాస్ రాజాసాబ్ సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా పార్ట్ 1 మార్చ్ 28న రిలీజ్ కానుంది.
ఇక ఇటీవలే నిధి అగర్వాల్ కు కొంతమంది చంపేస్తామని, ఆమె ఫ్యామిలీని చంపేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.