Tamil Music Director for Allu Arjun Atlee Movie Rumors goes Viral
Allu Arjun – Atlee : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రెండు సినిమాల అనౌన్స్మెంట్స్ వచ్చేశాయి. అందులో ఒకటి డైరెక్టర్ అట్లీతో. మరొక్కటి త్రివిక్రమ్ సినిమా. కానీ ముందుగా అట్లీ సినిమానే చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. అల్లు అర్జున్ సినిమా ప్రాజెక్ట్ వివరాలను షేర్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఈ వీడియో మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. అభిమానుల ఊహకు అందని రీతిలో ఈ సినిమా ఉండనుందని ఓ టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో అడ్వాన్స్ టెక్నాలజీని వాడబోతున్నారంట. దీని కోసం అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్ లోని ప్రముఖ VFX సంస్థను సంప్రదించారు. హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉండనున్నట్లు బన్నీ తెలిపారు. అల్లు అర్జున్ కు స్క్రీన్ టెస్ట్ కూడా చేసారు.
Also See : Allu Arjun : పుట్టిన రోజు నాడు.. ఫ్యాన్స్ కి అభివాదం చేస్తున్న ఐకాన్ స్టార్.. ఫొటోలు వైరల్..
అయితే అట్లీ విడుదల చేసిన వీడియోకు మ్యూజిక్ ఇచ్చింది తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అని సమాచారం. దీంతో అట్లీ, అల్లు అర్జున్ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడంటున్నారు. సాయి అభ్యంకర్ ఇప్పటికే వర్క్ కూడా స్టార్ట్ చేసాడంటున్నారు.
ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేసే సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ నాన్ లోకల్ అంటున్నారు. మైథలజికల్ మూవీ కావడంతో కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అల్లు అర్జున్ సినిమా అంటేనే దేవీశ్రీ ప్రసాద్ లేదా థమన్ మ్యూజిక్ చేస్తుంటారు. కానీ ఈసారి ఈ ఇద్దరిని బన్నీ ఎందుకు పక్కన పెట్టేసాడు అని చర్చలు నడుస్తున్నాయి.