Saranya Ponvannan : స్టార్ ఆర్టిస్ట్ పై నిర్మాత ఫైర్.. బతిమాలినా ప్రమోషన్స్ కి రావట్లేదు..

అరువ సందై నిర్మాత రాజా మాట్లాడుతూ.. మనం ఎంతో కష్టపడి సినిమా తీస్తుంటే కొంతమంది ప్రమోషన్స్ కి రావట్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవాళ్ళు రాకపోతే ఎలా. ఈ సినిమాలో శరణ్యది..........

tamil producer raja fires on artist Saranya Ponvannan

Saranya Ponvannan :  ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరణ్య పొన్నవనన్ పై ఓ తమిళ నిర్మాత ఫైర్ అయ్యారు. తమిళ్ లో వైట్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజా అనే నిర్మాత అరువ సందై అనే సినిమాని తెరకెక్కించారు. హీరో లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక మీనన్ తో పాటు శరణ్య పొన్నవనన్ ముఖ్య పాత్రలు పోషించారు.

అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 30న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో నిర్మాత మాట్లాడుతూ శరణ్యపై ఫైర్ అయ్యారు.

Alia Bhatt : తలకిందులుగా యోగా చేస్తూ అలియా భట్.. పిల్లలు పుట్టినా సరే.. బాడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి..

అరువ సందై నిర్మాత రాజా మాట్లాడుతూ.. మనం ఎంతో కష్టపడి సినిమా తీస్తుంటే కొంతమంది ప్రమోషన్స్ కి రావట్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవాళ్ళు రాకపోతే ఎలా. ఈ సినిమాలో శరణ్యది మెయిన్ క్యారెక్టర్ అయినా సినిమా ప్రమోషన్స్ కి రావట్లేదు. ఇవాళ కూడా రాలేదు. చిన్న సినిమా కాబట్టే ఇలా చేస్తున్నారు. పెద్ద సినిమాలకైతే ఇలా మానేస్తారా. ఈ ఈవెంట్ కి రమ్మని శరణ్యని బతిమాలినా రాలేదు అని ఆమెపై వ్యాఖ్యలు చేశారు.