Alia Bhatt : తలకిందులుగా యోగా చేస్తూ అలియా భట్.. పిల్లలు పుట్టినా సరే.. బాడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి..

సాధారణంగానే హీరోయిన్స్ రోజూ వ్యాయామాలు, యోగాలు చేస్తూ ఫిట్ గా ఉంటారు. పెళ్లి అయినా, పిల్లలు పుట్టినా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే కెరీర్ కి ప్రమాదం తప్పదు. అందుకే అలియా భట్ కూడా పాపా పుట్టిన రెండు నెలలకే బాడీ మీద ఫోకస్ చేసేసింది. కొన్ని రోజుల క్రితమే..........

Alia Bhatt : తలకిందులుగా యోగా చేస్తూ అలియా భట్.. పిల్లలు పుట్టినా సరే.. బాడీని జాగ్రత్తగా ఉంచుకోవాలి..

Alia Bhatt post on fitness after delivery

Updated On : December 26, 2022 / 10:55 AM IST

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క ఫ్యామిలీ లైఫ్ ని చక్కగా లీడ్ చేస్తుంది. రెండు నెలల క్రితమే అలియాకి ఒక పాప కూడా పుట్టిన సంగతి తెలిసిందే. ఆ పాపకి రాహా అనే పేరుని పెట్టారు అలియా-రణబీర్.

సాధారణంగానే హీరోయిన్స్ రోజూ వ్యాయామాలు, యోగాలు చేస్తూ ఫిట్ గా ఉంటారు. పెళ్లి అయినా, పిల్లలు పుట్టినా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే కెరీర్ కి ప్రమాదం తప్పదు. అందుకే అలియా భట్ కూడా పాపా పుట్టిన రెండు నెలలకే బాడీ మీద ఫోకస్ చేసేసింది. కొన్ని రోజుల క్రితమే జిమ్ కి వెళ్తూ కనిపించింది అలియా. తాజాగా గాలిలో తలకిందులుగా యోగా చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేసి వ్యాయామం, బాడీ ఫిట్నెస్ గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలియా.

Samantha : మరింత స్ట్రాంగ్‌గా తయారవుతా.. ఆ డైరెక్టర్ ఇచ్చిన గిఫ్ట్‌తో సమంత..

అలియా భట్ గాలిలో తలకిందులుగా యోగా చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేసి.. డెలివరీ అయిన నెలన్నర తర్వాత నా బాడీ మీద ఫోకస్ చేశాను. పాప పుట్టాక కొన్ని రోజులు ప్రాణమాయం, వాకింగ్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు పూర్తిగా శరీరం పై దృష్టి పెట్టి వ్యాయామాలు చేస్తున్నాను. నా ట్రైనర్ ఆధ్వర్యంలో ఇవి చేస్తున్నాను, ఇంకా చేయాలి. బిడ్డకి జన్మనివ్వడం అనేది ఒక మంచి అనుభూతి, కానీ ఆ తర్వాత మన శరీరం మీద దృష్టి పెట్టి శరీరరాన్ని ప్రేమించాలి. అందరి శరీరాలు ఒకేలా ఉండవు కాబట్టి, మీ సొంతంగా కాకుండా డాక్టర్, ట్రైనర్ సలహాల మేరకు వ్యాయామం చేయండి అని తెలిపింది.

View this post on Instagram

A post shared by Alia Bhatt ? (@aliaabhatt)