Madhan Bob : తమిళ్ స్టార్ కమెడియన్ కన్నుమూత.. తెలుగులో పవన్ కళ్యాణ్ ఒక్క సినిమానే చేసిన నటుడు..

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Madhan Bob

Madhan Bob : తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ్ స్టార్ కమెడియన్, మ్యూజిషియన్ మదన్ బాబ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో వయోభారంతో, పలు ఆరోగ్య సమస్యలతో నిన్న రాత్రి మరణించారు. పలువురు తమిళ ప్రేక్షకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

మెడికల్ రిప్రసెంటివ్ గా కెరీర్ మొదలుపెట్టి, సేల్స్ ఆఫీసర్ గా పనిచేసి అనంతరం మ్యూజిక్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పలువురు తమిళ సంగీత దర్శకుల వద్ద పనిచేసి అనంతరం నటుడిగా మారాడు. తమిళ్ లో దాదాపు 200 సినిమాల్లో నటించాడు. కమెడియన్ గా మదన్ బాబ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన అసలు పేరు కృష్ణమూర్తి కాగా సినిమాలతో మదన్ బాబ్ గా మారింది.

Also Read : Nagavamsi : మీ సరదాల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రివ్యూలపై నిర్మాత ఫైర్..

ఆల్మోస్ట్ తమిళ్ లోనే సినిమాలు చేసిన మదన్ బాబు తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో నటించాడు. తెలుగులో ఈ ఒక్క సినిమాలోనే నటిచడం గమనార్హం.