Nagavamsi : మీ సరదాల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రివ్యూలపై నిర్మాత ఫైర్..
తాజాగా కింగ్డమ్ ప్రమోషన్స్ లో మరోసారి రివ్యూల గురించి మాట్లాడారు.

Nagavamsi
Nagavamsi : గత కొంతకాలంగా పలువురు నిర్మాతలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఇచ్చే సినిమా రివ్యూలపై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని సినిమా రివ్యూ అంటూ చెప్పేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో కూడా కొంతమంది ఫాలోవర్స్ రాగానే సినిమా రివ్యూలు అంటూ చెప్తున్నారు.
యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రివ్యూలకు మంచి వ్యూస్ వస్తుండటంతో చాలా మంది ఇదే చేస్తున్నారు. ఇక వాటికి తగ్గ థంబ్ నెయిల్స్, నెగిటివ్ అట్రాక్షన్ తో పాపులర్ అవుతున్నారు. గతంలో నాగవంశీ పలుమార్లు రివ్యూలపై కామెంట్స్ చేయగా తాజాగా కింగ్డమ్ ప్రమోషన్స్ లో మరోసారి రివ్యూల గురించి మాట్లాడారు.
Also Read : Peddi : ‘పెద్ది’లో స్పెషల్ శ్రీకాకుళం సాంగ్.. భారీగా ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు..
నాగవంశీ మాట్లాడుతూ.. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లలో రివ్యూలు పెట్టేవాళ్లనే నేను అంటున్నాను. చాలా మంది కావాలని నెగిటివ్ రివ్యూలు చెప్తున్నారు. నెగిటివ్ గా చెప్తే ఎక్కువ ట్రాక్షన్ అయి వాళ్లకు ఫాలోవర్స్, వ్యూస్, డబ్బులు వస్తున్నాయి. ఆ రివ్యూలలో సినిమాని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. జర్నలిస్టులు కాకుండా ఎవరెవరో రివ్యూ అని చెప్తున్నారు. కావాలంటే మీ ఒపీనియన్ అని చెప్పండి, రివ్యూ అని కాదు. మీకు వ్యూస్ కోసం, మీకు ఫాలోవర్స్, డబ్బుల కోసం, మీ సరదాల కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత డబ్బులు పెట్టి డైరెక్టర్, హీరో, వందల మంది కష్టపడితే ఒక సినిమా వస్తుంది. కోట్లల్లో తీసే సినిమాలు మీరు సరదాగా చేసే నెగిటివిటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. మీ సరదాకు సినిమాని చంపేస్తున్నారు. నాకు వెబ్ సైట్ రివ్యూలతో ఎలాంటి సమస్య లేదు. కేవలం ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ రివ్యూలు మాత్రమే ఇలా సినిమాలపై నెగిటివిటీ చేస్తున్నారు అని అన్నారు.
Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ లైనప్ మాములుగా లేదుగా.. ఏకంగా అరడజను సినిమాలు..