Tamil star Dhanush demanding Rs 50 crores For Telugu movie
Tamil Star; ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో మంచి సంప్రదాయం మొదలయ్యింది. అదేంటంటే, స్టార్స్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. తెలుగు హీరోలు తమిళ్ లో, తమిళ హీరోలు తెలుగులో ఇతర భాషల్లో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఆడియన్స్ కి కూడా ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఒక సినిమా చేసి హిట్ అవగానే రెమ్యునరేషన్ మాత్రం ఒక రేంజ్ లో పెంచేస్తున్నారట. తాజాగా ఒక తమిళ స్టార్ తో సినిమా చేయడానికి వెళ్లిన తెలుగు నిర్మాతలకు అదిరిపోయే జలక్ ఇచ్చాడట ఆ స్టార్ హీరో.
Naga Chaitanya: నిజాయితీగా ఉండాలి.. అప్పుడే జనాలు ఇష్టపడతారు .. నాగ చైతన్య పోస్ట్ వైరల్
ఇంతకీ ఆ స్టార్ మరెవరో కాదు ధనుష్(Tamil Star). ధనుష్ తెలుగులో డైరెక్ట్ గా రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి సార్ సినిమా కాగా, రెండవది కుబేర. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రెండు సినిమాలు కూడా రూ.100 కోట్లకు పైన వసూళ్లను సాధించాయి. అందుకే, తెలుగు నిర్మాతలు ధనుష్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే, ప్రముఖ నిర్మాత ఒకరు ధనుష్ కి కథ చెప్పించడానికి ఒక దర్శకుడిని తీసుకొని చెన్నై కి వెళ్ళాడట. అలాగే, ఆ దర్శకుడు చెప్పిన కథ కూడా ధనుష్ కి నచ్చిందట. కానీ, కథ అంతా విన్నాక రెమ్యునరేషన్ గురించి చెప్పాడట ధనుష్.
తెలుగులో సినిమా చేయాలంటే తనకు రూ.50 కొట్లు రెమ్యునరేషన్ గా ఇవ్వాలని కండీషన్ పెట్టాడట. దీంతో ఆ నిర్మాత ఖంగుతిన్నాడని సమాచారం. సార్, కుబేర సినిమాలకు కేవలం రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు ధనుష్. అలా రెండు హిట్లు పడగానే రూ.50 కోట్లకు పెంచేశాడట. దీంతో.. ఆ నిర్మాత, దర్శకుడు చేసేదేం లేక తిరిగి వచ్చేశారట. మరి ఆ రెమ్యునరేషన్ కి నిర్మాత ఒప్పుకుంటాడా, లేక వేరే హీరోను చేసుకుంటాడా అనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ఇడ్లీ కడాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్.. ప్రస్తుతం రెండు తమిళ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.