Pawan Kalyan OG Song : పవన్ కళ్యాణ్ OG కోసం.. పాట పడనున్న తమిళ్ స్టార్..

పవన్ కళ్యాణ్ OG సినిమాలో తమిళ్ స్టార్ హీరో సాంగ్ పాడనున్నాడట.

Tamil Star Hero Simbu will Sing a Song in Pawan Kalyan OG Movie

Pawan Kalyan OG Song : పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫ్యాన్స్ OG సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే ఈ సినిమా షూట్ పూర్తయిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి, పలువురు ఈ సినిమా గురించి మాట్లాడి భారీ హైప్ ని పెంచారు. తాజాగా OG సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ OG సినిమాలో తమిళ్ స్టార్ హీరో శింబు సాంగ్ పాడనున్నాడట. తమిళ్ హీరో శింబు సింగర్ కూడా. ఇప్పటికే తెలుగు, తమిళ్ తో పాటు వేరే భాషల్లో కూడా అనేక సాంగ్స్ పాడాడు. గతంలో తెలుగులో ఎన్టీఆర్, మంచు మనోజ్, నిఖిల్, రామ్.. వంటి హీరోలకు శింబు పాటలు పాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సాంగ్ పాడబోతున్నట్టు సమాచారం.

Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ లో ఈ సారి కెప్టెన్సీ పదవి లేదు.. కొత్తగా చీఫ్ పదవి.. ఈ వారం ముగ్గురు చీఫ్ లు..

పవన్ OG సినిమాలో శింబు టైటిల్ సాంగ్ పాడతాడని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు