Bigg Boss 8 : బిగ్ బాస్ లో ఈ సారి కెప్టెన్సీ పదవి లేదు.. కొత్తగా చీఫ్ పదవి.. ఈ వారం ముగ్గురు చీఫ్ లు..
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఒక కెప్టెన్ పదవి ఉంటుంది. అది దక్కించుకోవడానికి టాస్కులు పెడితే అందరూ ఆడి ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారు.

Bigg Boss Telugu Season 8 Having New Rules No Captain in House
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఓ నలుగురు తప్ప మిగిలిన వాళ్ళ ముఖాలు కూడా చాలా మందికి తెలియని వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్లే మళ్ళీ సెలబ్రిటీలు అవుతారు. ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్, కొత్త టాస్కులు, కొత్తగా ఉంటుందని నాగార్జున ముందు నుంచి చెప్పుకొచ్చాడు. చెప్పినట్టే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ పదవులు తీసేసాడు.
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ఒక కెప్టెన్ పదవి ఉంటుంది. అది దక్కించుకోవడానికి టాస్కులు పెడితే అందరూ ఆడి ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారు. కెప్టెన్ కు కొన్ని అధికారాలు ఉంటాయి. వారం వారం కెప్టెన్ మారతారు. దీంతో హౌస్ లో అందరూ కెప్టెన్ అవ్వాలనుకునేవాళ్ళు. అయితే ఈసారి అసలు కెప్టెన్సీ అనేదే లేదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ కెప్టెన్ పదవులకు బదులు చీఫ్ అని కొత్త పదువులు తీసుకొచ్చారు.
Also See : Deepika Padukone Baby Bump : భర్తతో కలిసి దీపికా పదుకోన్ బేబీ బంప్ ఫొటోస్..
కెప్టెన్ అయితే ఒకరే ఉండే వాళ్ళు. చీఫ్ లు ఒకరి కంటే ఎక్కువ మందినే ఎంచుకుంటున్నారు బిగ్ బాస్. ఈ చీఫ్ పదవులు కూడా టాస్కులతోనే గెలుచుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన టాస్కుల్లో గెలిచి మొదటి చీఫ్ గా నిఖిల్ ఎంపికయ్యాడు. ఆ తర్వాత నైనిక రెండో చీఫ్ గా ఎంపికయింది. వీరిద్దరినీ మూడో చీఫ్ ని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ చెప్పడంతో యష్మిని మూడో చీఫ్ గా ఎంపిక చేసారు. ఈ విషయంలో నిఖిల్ నచ్చిన వాళ్ళని చీఫ్ చేసాడని మిగిలిన కంటెస్టెంట్స్ తో గొడవలు అయ్యాయి. మరి ఈ చీఫ్ లకు ఉండే అధికారాలు ఏంటి, వీళ్ళేం చేస్తారో మున్ముందు ఎపిసోడ్స్ లో చూడాలి.