Sriya Reddy : OG నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ లేడీ విలన్ OG సినిమాలో.. ఏ పాత్రకో?

తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. OG సినిమాలో ఓ కీలక పాత్రకు తమిళ నటి శ్రియారెడ్డిని తీసుకున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Tamil Star Sriya Reddy plays a key Role in Pawan Kalyan OG Movie

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమా షూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ రాబోయే సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా OG. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టారు. ఇటీవలే ఈ సినిమాలో తమిళ్ స్టార్ నటుడు అర్జున్ దాస్(Arjun Das) నటించబోతున్నాడని ప్రకటించి సినిమాపై మరింత హైప్ పెంచారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. OG సినిమాలో ఓ కీలక పాత్రకు తమిళ నటి శ్రియారెడ్డిని తీసుకున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పొగరు సినిమాలో విశాల్ కి విలన్ గా కనిపించింది ఈమె. లేడీ విలన్ గా ఆ సినిమాలో శ్రియరెడ్డి చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పటికి గుర్తుండిపోతుంది. శ్రియరెడ్డి విశాల్ కి వదిన కూడా అవుతుంది.

Rajamouli : రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా.. ఆ యాడ్ లో నటిస్తున్నారా? వైరల్ అవుతున్న వీడియో..

శ్రియ రెడ్డి పలు తమిళ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే సలార్ సినిమాలో కూడా నటించినట్టు, తన షూటింగ్ పార్ట్ అయిపోయినట్టు ప్రకటించింది. తాజాగా OG యూనిట్ శ్రియరెడ్డిని ఈ సినిమాలో తీసుకున్నాం, షూటింగ్ లో జాయిన్ అవుతుందని ప్రకటించడంతో అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో OG సినిమాపై మరింత హైప్ పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్స్ పవన్ లేని పోర్షన్ ని చేస్తున్నట్టు సమాచారం.