Tamil Super Hit Movie Kavin DaDa Releasing in Telugu with PaPa Title
DaDa Movie : వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు ఇటీవల మన తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాంటి పలు సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ్ లో పెద్ద హిట్ అయిన ఓ చిన్న సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది. కవిన్, అపర్ణ దాస్ జంటగా డైరెక్టర్ గణేష్ కె బాబు దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన సినిమా ‘డా..డా’.
Also Read : Nagarjuna Akkineni : నాగచైతన్య పెళ్లికి ముందు ఖరీదైన కార్ కొన్న నాగ్.. ఎన్ని కోట్లో తెలుసా..
ఈ సినిమాను తెలుగు ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో ఆల్మోస్ట్ 30 కోట్లు వసూలు చేసి భారీ హిట్ కొట్టింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో పాటు ప్రేమ ఎమోషన్, కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. మరి ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.