×
Ad

Young Hero : వరుస వంద కోట్ల సినిమాల హీరో.. తండ్రి మాత్రం ఇంకా జిరాక్స్ షాప్ నడిపిస్తూ..

తాజాగా ఓ హీరో తన తండ్రి ఇంకా జిరాక్స్ షాప్ నడుపుతున్నాడు అని చెప్పడం వైరల్ గా మారింది.(Young Hero)

Young Hero

Young Hero : ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు, లివింగ్ కల్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. కొంతమంది మాత్రమే ఎంత సంపాదించినా, సక్సెస్ అయినా సింపుల్ గా ఉంటారు. కొంతమంది స్టార్స్ పేరెంట్స్ కూడా సింపుల్ గానే ఉంటారు. తాజాగా ఓ హీరో తన తండ్రి ఇంకా జిరాక్స్ షాప్ నడుపుతున్నాడు అని చెప్పడం వైరల్ గా మారింది.(Young Hero)

ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా? తమిళ్, తెలుగులో లో దూసుకుపోతున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్. కోమలి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ లవ్ టుడే సినిమాతో హీరోగా మారి వంద కోట్లు సాధించి పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత డ్రాగన్ సినిమాతో కూడా 100 కోట్లు సాధించాడు. ఇప్పుడు హీరోగా మూడో సినిమా డ్యూడ్ సినిమాతో వస్తున్నాడు.

Also See : Bunty Gadicherla : ఋతురాగాలు, మొగలిరేకులు.. అప్పటి హిట్ సీరియల్ సాంగ్స్ కంపోజ్ చేసింది ఎవరో తెలుసా? పొద్దున్న డాక్టర్ సాయంత్రం మ్యూజిక్ డైరెక్టర్..

డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమిళ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చెప్పుకొచ్చాడు ప్రదీప్ రంగనాథన్.

ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. మా నాన్న ఇప్పటికి జిరాక్స్ షాప్ నడుపుతారు. ఆయనకు బయట కనిపించడం, ఫేమ్ అవ్వడం ఇష్టం ఉండదు. నేను ఆయనకు కార్ కొనిస్తాను అన్నాను కానీ ఆయన ఇప్పటికి బస్ లోనే వెళ్తారు. నేను ఒక సింపుల్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఇంటర్ వరకు నేను టాప్ స్టూడెంట్ నే. ఇంజినీరింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ మొదలుపెట్టాను. మా నాన్న కొంచెం బాధపడ్డారు. అప్పుడు నేను ఇది కేవలం హాబీ కోసమే అని, ఇది కెరీర్ కాదు అని చెప్పాను. నా మొదటి సినిమా కోమలి రిలీజ్ అయ్యాక ఇదే నా కెరీర్ అని చెప్పాను మా నాన్నకు అని తెలిపాడు.

Also See : Digangana Suryavanshi : ఉదయం ఇలా.. రాత్రి అలా.. ఈ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?