Arun Vijay : మరో తమిళ హీరోకి షూటింగ్‌లో ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫోటో!
షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరగడం అనేది చూస్తూనే ఉంటాము. కానీ ఇటీవల కాలంలో తమిళ పరిశ్రమలో వరుసగా హీరోలు అంతా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవలే బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ.. షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురై తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరాడు. తాజాగా మరో తమిళ హీరో కూడా మూవీ సెట్ లో ప్రమాదానికి గురయ్యాడు.

Arun Vijay
Arun Vijay : షూటింగ్ సమయంలో ప్రమాదాలు జరగడం అనేది చూస్తూనే ఉంటాము. కానీ ఇటీవల కాలంలో తమిళ పరిశ్రమలో వరుసగా హీరోలు అంతా ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవలే బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ.. షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ కి గురై తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరాడు. తాజాగా మరో తమిళ హీరో కూడా మూవీ సెట్ లో ప్రమాదానికి గురయ్యాడు. హీరోగా, విలన్ గా నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘అరుణ్ విజయ్’.
Arun Vijay : నటుడు విజయ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలియజేసిన అరుణ్ విజయ్..
తెలుగులో రామ్ చరణ్ – బ్రూస్ లీ, ప్రభాస్ – సాహూ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో ‘అచ్చం ఎన్బదు ఇళయై’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరుగుతుంది. మూవీ లోని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా అరుణ్ విజయ్ కి గాయం అయ్యింది. దీంతో షూటింగ్ ని నిలిపివేసి ఇండియా వచ్చి కేరళలో ఆయుర్వేద చికిత్సను తీసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ.. “గాయమైన నా మోకాళ్లకు ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేయించుకుంటున్నాను. ఇది నా నాలుగో రోజు ట్రీట్‌మెంట్. త్వరలోనే తిరిగి షూటింగ్ లో పాల్గొంటాను” అంటూ రాసుకొచ్చాడు.
ఇక ఈ ఫోటోలు చూసిన అరుణ్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ లో అరుణ్ గాయం అవ్వడం ఇది మూడో సారి. వరుసగా నెలలు గ్యాప్ లో అరుణ్ ప్రమాదానికి గురి కావడం అభిమానులను కలవరపరుస్తుంది. గత ఏడాది ఇదే మూవీ షూటింగ్ చేస్తుండగా అక్టోబర్‌లో మోకాలికి గాయం అయ్యింది. మళ్ళీ ఆ తరువాత నెలలోనే చేతులకు గాయమైంది. ఇలా వరుసగా ప్రమాదం భారిన పడుతుండడంతో ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram