Arun Vijay : నటుడు విజయ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలియజేసిన అరుణ్ విజయ్..

తమిళ నటుడు అరుణ్ విజయ్.. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. తెలుగులో రామ్ చరణ్ నటించిన 'బ్రూస్‌లీ' సినిమాలో అరుణ్ విలన్ గా చేసి తెలుగు వారికి పరిచయమయ్యాడు. కాగా అరుణ, సీనియర్ హీరో విజయ్‌కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు అని అందరికి తెలుసు..

Arun Vijay : నటుడు విజయ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి తెలియజేసిన అరుణ్ విజయ్..

Arun Vijay gave clarity on health condition of vijay kumar

Updated On : December 24, 2022 / 8:35 AM IST

Arun Vijay : తమిళ నటుడు అరుణ్ విజయ్.. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ నటుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ సినిమాలో అరుణ్ విలన్ గా చేసి తెలుగు వారికి పరిచయమయ్యాడు. ఆ తరువాత ప్రభాస్ ‘సాహో’లో కూడా నటించాడు. సినిమాలే కాదు ‘తమిళ్ రాకర్స్’ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు అరుణ్.

Suriya : సూర్యతో మూవీ ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

కాగా అరుణ, సీనియర్ హీరో విజయ్‌కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు అని అందరికి తెలుసు. తెలుగులో చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ సినిమాతో తెలుగు వారికి విజయ్‌కుమార్ సుపరిచితుడు. అయితే విజయ్‌కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారని, అయన పరిస్థితి ఏమి బాగోలేదని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవి చూసిన అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులు కంగారు పడుతున్నారు.

దీంతో అరుణ్ విజయ్ ఆ విషయం గురించి వివరణ ఇచ్చాడు. “మా నాన్న సంపూర్ణ ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ని నమ్మకండి” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఇక ఈ వార్త విన్న అభిమానులు రిలాక్స్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Arun Vijay (@arunvijayno1)