Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..

చెన్నైలో రెండో ద‌శ మెట్రో ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఆళ్వార్ పేట‌లోని క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఆఫీస్ నుంచే మెట్రో వెళుతుంది. స్టేష‌న్ నిర్మాణం కోసం..............

Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..

Kamal Hasan

Updated On : July 4, 2022 / 10:30 AM IST

Kamal Haasan :  ఇటీవలే విక్ర‌మ్ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టారు కమల్ హాసన్. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కమల్ లో కొత్త జోష్ నింపింది ఈ సినిమా. గత కొన్ని రోజులుగా విక్రమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు కమల్. తాజాగా కమల్ సక్సెస్ మూడ్ లో ఉండగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నోటీసులు పంపింది.

చెన్నైలో రెండో ద‌శ మెట్రో ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా ఆళ్వార్ పేట‌లోని క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఆఫీస్ నుంచే మెట్రో వెళుతుంది. స్టేష‌న్ నిర్మాణం కోసం కమల్ కి చెందిన ఈ స్థలంలో 170 చ‌ద‌ర‌పు అడుగులు కావాలని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క‌మ‌ల్ హాస‌న్‌కు నోటీసులు పంపింది. ఇదే స్థలంలో క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ ఆఫీస్‌ కూడా ఉంది.

Suchendra Prasad : పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో తెలీదు..

అయితే ఈ విషయంపై కమల్ కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ స్పందించలేదు. మ‌రి క‌మ‌ల్ హాస‌న్ స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి మెట్రో కోసం స్థ‌లాన్ని ఇస్తారో లేదో చూడాలి. ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నా అందుకు పరిహారం కచ్చితంగా ఇస్తుంది కాబట్టి కమల్ స్థలాన్ని ఇవ్వడానికి వెనుకాడరని అంటున్నారు. ఇటీవలే సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ విక్రమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొన్నాడు.