Tanikella Bharani : తనికెళ్ళ భరణికి ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందట.. అలాంటి సినిమాలకు నిర్మాతలు దొరకట్లేదట..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు మిగిలిపోయిన ఒక కోరిక గురించి తెలిపారు తనికెళ్ళ భరణి.

Tanikella Bharani Interview he said about his life time dream regarding Movies

Tanikella Bharani :  తెలుగు సినీ పరిశ్రమలో40 ఏళ్లకు పైగా రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, కవిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు తనికెళ్ళ భరణి. దాదాపు 800లకు పైగా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. త్వరలో శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో తెరకెక్కిన పెదకాపు 1(Peddha Kapu 1) సినిమాతో సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు మిగిలిపోయిన ఒక కోరిక గురించి తెలిపారు తనికెళ్ళ భరణి.

Also Read : Vijay Antony : రెహమాన్ కాన్సర్ట్ వివాదంలోకి విజయ్ ఆంటోనీ.. పరువు నష్టం దావా వేస్తాను అంటూ..

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. మిథునం తర్వాత నా దర్శకత్వంలో ఇంకో సినిమా రాలేదు. నేను కమర్షియల్ సినిమాలు తీయలేను. కేవలం ఆర్ట్ సినిమాలు మాత్రమే తీస్తాను. అలాంటి సినిమాలకు ఇప్పుడు నిర్మాతలు దొరకట్లేదు. నా నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో నేను అనుకున్నవి అన్ని చేసేశాను. అన్ని విభాగాల్లో పనిచేశాను. నా కెరీర్ పై సంతృప్తిగానే ఉన్నాను. కానీ ఎప్పట్నుంచో ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే కోరిక ఉంది. ఆ కోరిక మాత్రం ప్రస్తుతానికి ఇంకా అలాగే మిగిలిపోయి ఉంది అని అన్నారు. మరి తనికెళ్ళ భరణి గారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, ఆయన దర్శకత్వంలో అంతర్జాతీయ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పుడు కూడా పలు సినిమాలతో నటుడిగా ఇంకా బిజీగా ఉన్నారు తనికెళ్ళ భరణి.