Tanikella Bharani : అలాంటి పాత్రలే వస్తున్నాయని ఏకంగా ఒక ఏడాదిలోనే 18 సినిమాలు వదిలేసుకున్న తనికెళ్ళ భరణి..

నా కెరీర్ లో నటుడిగా దాదాపు 800 సినిమాలు చేస్తే అందులో 300 సినిమాలు కేవలం తండ్రి పాత్రలే చేశాను.

Tanikella Bharani rejected almost 18 movies in a single year because of same characters

Tanikella Bharani :  తెలుగు సినీ పరిశ్రమలో40 ఏళ్లకు పైగా రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, కవిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు తనికెళ్ళ భరణి. దాదాపు 800లకు పైగా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. త్వరలో శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో తెరకెక్కిన పెదకాపు 1(Peddha Kapu 1) సినిమాతో సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తి విషయాలని తెలియచేశారు.

Tanikella Bharani : తనికెళ్ళ భరణికి ఆ కోరిక మిగిలిపోయిందట.. అలాంటి సినిమాలకు నిర్మాతలు దొరకట్లేదట..

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. నా కెరీర్ లో నటుడిగా దాదాపు 800 సినిమాలు చేస్తే అందులో 300 సినిమాలు కేవలం తండ్రి పాత్రలే చేశాను. దీంతో తండ్రి పాత్రలు అంటే విసుగొచ్చేసింది. ఈ సంవత్సరం తండ్రి పాత్రలు చేయమని కూడా అవకాశాలు వస్తే 18 సినిమాలు వదిలేసుకున్నాను. ఇకపై కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్నాను. పెదకాపు సినిమాలో సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి అయిన స్కూల్ టీచర్ పాత్ర రావడంతో ఒప్పుకున్నాను. చాలా మంచి క్యారెక్టర్, మంచి సబ్జెక్టు కావడంతో ఒప్పుకున్నాను అని అన్నారు. దీంతో తనికెళ్ళ భరణి 18 సినిమాలు ఒకే రకం పాత్రలు అని వదిలేశారని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.