Tarakaratna : నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టిన రోజు.. కానీ అంతలోనే ఇలా..
ఫిబ్రవరి 18 శనివారం నాడు తారకరత్న మరణించారు. అదే రోజు మహాశివరాత్రి కావడం గమనార్హం. అయితే మరో మూడు రోజుల్లోనే తారకరత్న పుట్టిన రోజు ఉంది. 22 ఫిబ్రవరి 1983న తారకరత్న జన్మించారు. ఈ సంవత్సరంతో తారకరత్న 40 ఏళ్ళ వయసులోకి............

Taraka Ratna birthday Within four days died at this time
Tarakaratna : నటుడు నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. తెలుగు సినీపరిశ్రమలో గత కొంత కాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తూ విషాదాన్ని మిగిల్చారు. తాజాగా తారకరత్న మృతి చెందడంతో మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ తారకరత్న అకస్మాత్తుగా శనివారం రాత్రి అకాల మరణం చెందడం బాధాకరం. ఫిబ్రవరి 18 శనివారం నాడు తారకరత్న మరణించారు. అదే రోజు మహాశివరాత్రి కావడం గమనార్హం. అయితే మరో మూడు రోజుల్లోనే తారకరత్న పుట్టిన రోజు ఉంది. 22 ఫిబ్రవరి 1983న తారకరత్న జన్మించారు. ఈ సంవత్సరంతో తారకరత్న 40 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టనున్నారు.
ఇప్పుడిప్పుడే రాజకీయంగా యాక్టివ్ అవుతున్న తారకరత్న ఈ సారి తన 40వ పుట్టిన రోజు వేడుకలు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య జరుపుకోవాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా అకాల మరణం చెందటంతో అంతా తీవ్ర బాధలో ఉన్నారు. 40 ఏళ్లకే కన్నుమూయడంతో చిన్న వయసులోనే మరణించాడని అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంతా ప్రార్థిస్తున్నారు.