Taraka Ratna : నందమూరి తార‌క‌ర‌త్న కన్నుమూత.. ప్రముఖుల నివాళులు.. లైవ్ అప్డేట్స్

తాజాగా నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం................

Taraka Ratna passed away celebrities pay tributes live updates

Taraka Ratna :  తెలుగు సినీపరిశ్రమలో తాజాగా మరో విషాదం నెలకొంది. గత కొద్దికాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 19 Feb 2023 06:22 PM (IST)

    తారకరత్న మరణాన్ని దాచిపెట్టారు.. లక్ష్మీ పార్వతి!

    తారకరత్న మరణం పై లక్ష్మీ పార్వతి సంచలన కామెంట్స్.. "తారకరత్న గుండెపోటు వచ్చిన రోజునే మరణించాడు. కానీ ఆ విషయం తెలిస్తే ఎక్కడ లోకేష్ పాదయాత్రకి చెడ్డ పేరు వస్తుందో అని ఇన్నాళ్లు దాచి పెట్టారు" అంటూ వ్యాఖ్యానించింది.

  • 19 Feb 2023 06:08 PM (IST)

    తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి అస్వస్థత..

    తారకరత్న ఏకాహళ మరణంతో అతని భార్య అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి లోనయ్యింది అంటూ విజయ్ సాయిరెడ్డి తెలియజేశాడు. నిన్న సాయంత్రం నుంచి ఆమె ఆహారం తీసుకోక పోవడంతో ఆమె నీరసించి పోయిందని, ఆమెను హాస్పిటల్ కి తరలించే యోచనలో ఉన్నట్లు తెలియజేశాడు.

     

     

  • 19 Feb 2023 05:18 PM (IST)

    మీడియాతో హీరో శ్రీకాంత్..

    తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. "తారకరత్న కల్ముషం లేని వ్యక్తి. తనతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. మా ఇంటికి వచ్చి చాలా సరదాగా గడిపే వాడు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

  • 19 Feb 2023 04:43 PM (IST)

    మీడియాతో కోడలి నాని..

    తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కోడలి నాని మీడియాతో మాట్లాడుతూ.. "తారకరత్న అందరితో చాలా మంచి ఉండేవాడు. తాతగారు స్థాపించిన పార్టీ తరుపు నుంచి పోటీ చేయాలనీ అనుకుంటున్నట్లు తారకరత్న నాతో అనేవాడు. అతని ఆత్మకు శాంతి కలగాలి" అంటూ వ్యాఖ్యానించాడు.

  • 19 Feb 2023 03:53 PM (IST)

    బాలకృష్ణ

    విజయ్ సాయి రెడ్డితో బాలకృష్ణ మంతనాలు..

  • 19 Feb 2023 03:50 PM (IST)

    తారకరత్న ఇంటికి చేరుకున్న బాలకృష్ణ..

    తారకరత్న హాస్పిటల్ లో ఉన్న సమయంలో అక్కడే తోడుగా ఉన్న బాలకృష్ణ.. నిన్న సాయంత్రం కూడా తారకరత్న పరిస్థితి విషమం అని తెలుసుకొని బెంగళూరు చేరుకున్నాడు. తారకరత్న తుది శ్వాస విడిచాక.. ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకు రాగా, బాలకృష్ణ ఇప్పుడే తారకరత్న ఇంటికి చేరుకున్నాడు.

  • 19 Feb 2023 03:43 PM (IST)

    కోడలి నాని - విజయ్ సాయి రెడ్డి

    తారకరత్నకి నివాళులు అర్పించిన కోడలి నాని.. విజయ్ సాయి రెడ్డితో కొంతసేపు మంతనాలు జరిపారు.

  • 19 Feb 2023 03:39 PM (IST)

    విజయ్ సాయి రెడ్డితో చిరు మంతనాలు

    తారకరత్నకి నివాళులు అర్పించిన అనంతరం, విజయ్ సాయి రెడ్డితో చిరు మంతనాలు..

  • 19 Feb 2023 03:34 PM (IST)

    చిరంజీవి

    తారకరత్న భార్యని పరామర్శించిన చిరంజీవి..

  • 19 Feb 2023 03:32 PM (IST)

    కోడలి నాని

    తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కోడలి నాని..

  • 19 Feb 2023 03:29 PM (IST)

    చిరంజీవి

    తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి..

     

  • 19 Feb 2023 01:09 PM (IST)

    నటుడు శివబాలాజీ తారకరత్నకు నివాళులు

    నటుడు శివబాలాజీ తారకరత్నకు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

     

  • 19 Feb 2023 12:57 PM (IST)

    నటుడు రాజేంద్రప్రసాద్

    తారకరత్నకు నివాళులు అర్పించి నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నా పిల్లల్లో ఒకడి లాంటివాడు తారకరత్న. ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాడు. అందరితో చాలా మంచివాడు అనిపించుకున్నాడు. అందరితో మంచిగా ఉంటాడు. ఇంత చిన్న వయసులో మరణించడంతో చాలా షాక్ లో ఉన్నాను. మాటలు కూడా రావట్లేదు. ఒక అద్భుతమైన, మంచి బిడ్డని నేను కోల్పోయాను అని చెప్తూ బాధపడ్డారు.

  • 19 Feb 2023 12:34 PM (IST)

    తారకరత్నకు నివాళులున అలీ

    తారకరత్నకు నివాళులు అర్పించి నటుడు అలీ మీడియాతో మాట్లాడుతూ.. నా తమ్ముడి క్లాస్ మెట్, మా ఇంటికి వచ్చేవాడు. చాలా మంచివాడు, ఆయనతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. మా ఫ్యామిలీకి దగ్గరైన వ్యక్తి ఇలా చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం అని అన్నారు.

     

     

  • 19 Feb 2023 12:26 PM (IST)

    మీడియాతో చంద్రబాబు

    తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చాలా మంచివాడు, సమాజానికి మంచి చేయాలనుకున్నాడు. చిన్నవయసులోనే దూరమయ్యారు. ఆయన లోటు కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అంటూ ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబు మాట్లాడుతుండగా పక్కనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉండటం గమనార్హం.

     

  • 19 Feb 2023 12:15 PM (IST)

    నారా లోకేష్

    తారకరత్నకు నివాసానికి నారా బ్రాహ్మణితో కలిసి లోకేష్ చేరుకున్నాడు. తారకరత్న పార్థివ దేహానికి నివాళులు ఆరోపించారు నారా లోకేష్, బ్రాహ్మణి.

  • 19 Feb 2023 12:12 PM (IST)

    తారకరత్నకు నివాళులు అర్పించిన ఆర్ నారాయణమూర్తి

    తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

     

  • 19 Feb 2023 11:58 AM (IST)

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చంద్రబాబు మంతనాలు

    తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం అక్కడకు విచ్చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చంద్రబాబు కాసేపు మంతనాలు జరిపారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చంద్రబాబు కూర్చొని మాట్లాడుతుండటంతో ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ఎంపీ విజయసాయిరెడ్డి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి బంధువు అవుతారు.

     

     

  • 19 Feb 2023 11:27 AM (IST)

    నటి మంచు లక్ష్మి ప్రసన్న సంతాపం

    తారకరత్న మృతిపై నటి మంచు లక్ష్మి ప్రసన్న సంతాపం

  • 19 Feb 2023 11:26 AM (IST)

    హీరో వరుణ్ తేజ్ సంతాపం

    హీరో వరుణ్ తేజ్ సంతాపం

     

     

  • 19 Feb 2023 11:25 AM (IST)

    హీరో శ్రీ విష్ణు సంతాపం

    హీరో శ్రీ విష్ణు సంతాపం

     

     

  • 19 Feb 2023 11:24 AM (IST)

    ఎన్టీఆర్, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి

    తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం హీరో ఎన్టీఆర్, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూర్చొని మాట్లాడుకున్నారు.

     

  • 19 Feb 2023 11:22 AM (IST)

    మురళీమోహన్ నివాళులు

    తారకరత్నకు నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు సీనియర్ నటులు మురళీమోహన్. మామయ్య గారు అంటూ నవ్వుతూ ప్రేమగా మాట్లాడేవాడు తారకరత్న అని ఎమోషనల్ అయ్యారు మురళీమోహన్.

     

  • 19 Feb 2023 11:19 AM (IST)

    చంద్రబాబు నాయుడు

    తారకరత్నకు నివాళులు అర్పించేందుకు సతీమణి సమేతంగా వచ్చిన చంద్రబాబు నాయుడు

     

     

  • 19 Feb 2023 11:07 AM (IST)

    శివాజీరాజా తారకరత్నకు నివాళులు

    నటుడు శివాజీరాజా తారకరత్నకు నివాళులు అర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

     

  • 19 Feb 2023 10:07 AM (IST)

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

    తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విచ్చేశారు.

     

  • 19 Feb 2023 10:06 AM (IST)

    ఎన్టీఆర్

     

     

    తారకరత్నకు నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ నివాసానికి విచ్చేశారు.

  • 19 Feb 2023 09:46 AM (IST)

    ప్రధాని నరేంద్రమోడీ సైతం దిగ్బ్రాంతి

    తారకరత్న మృతిపై ప్రధాని నరేంద్రమోడీ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేశారు.

     

  • 19 Feb 2023 09:44 AM (IST)

    పోసాని కృష్ణ మురళి తారకరత్నకు నివాళులు

    పోసాని కృష్ణ మురళి తారకరత్నకు నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న నటుడిగానే కాకుండా ఒక మంచి మనిషి. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు అని తెలిపారు.

  • 19 Feb 2023 09:39 AM (IST)

    నటుడు అజయ్ నివాళులు

    తారకరత్న భౌతికకాయానికి నటుడు అజయ్ నివాళులు

     

     

  • 19 Feb 2023 09:14 AM (IST)

    తారకరత్న భౌతికకాయం వద్దే భార్య అలేఖ్య

    తారకరత్న భౌతికకాయం వద్దే భార్య అలేఖ్య

  • 19 Feb 2023 09:07 AM (IST)

    వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

    తారకరత్న మృతిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సంతాపం తెలియచేశారు.

  • 19 Feb 2023 08:48 AM (IST)

    తారకరత్న కూతురు

    తారకరత్న పార్థివదేహం చూసి కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది.

  • 19 Feb 2023 08:21 AM (IST)

    నారా లోకేష్ ఎమోషనల్

    తారకరత్న మరణంపై నారా లోకేష్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళులతో..నారా లోకేష్ అటు పోస్ట్ చేశారు.

     

     

  • 19 Feb 2023 08:19 AM (IST)

    తారకరత్న మరణంపై నారా చంద్రబాబు నాయుడు

    తారకరత్న మరణంపై నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు.

     

     

  • 19 Feb 2023 08:17 AM (IST)

    తారకరత్న మృతిపై జనసేనాని పవన్ కళ్యాణ్

    నందమూరి తారకరత్న మృతిపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో.. శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి, నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అంటూ తెలిపారు.

     

     

  • 19 Feb 2023 08:15 AM (IST)

    అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

    హీరో అల్లు అర్జున్ తారకరత్న మృతిపై.. త్వరగా వెళ్లిపోయారు, నా గుండె ముక్కలైంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

  • 19 Feb 2023 08:11 AM (IST)

    నిఖిల్ సోషల్ మీడియా పోస్ట్

    తారకరత్న మృతిపై ఎప్పుడూ నవ్వుతూ ఉండే మంచి మనిషి, తారక్ అన్నయ్యని మిస్ అవుతున్నాను అంటూ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

     

  • 19 Feb 2023 08:09 AM (IST)

    పరిటాల శ్రీరామ్ ఎమోషనల్ పోస్ట్

    తారకరత్న మృతిపై పరిటాల శ్రీరామ్.. నాకు అత్యంత ఆప్తులు, సోదర సమానులు నందమూరి తారకరత్న గారి అకాల మరణం తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. We will miss you anna అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ చేశారు.

  • 19 Feb 2023 08:06 AM (IST)

    రేవంత్ రెడ్డి సంతాపం

    తారకరత్న మృతిపై కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేశారు.

  • 19 Feb 2023 08:05 AM (IST)

    అల్లరి నరేష్ సంతాపం

    తారకరత్న మృతిపై హీరో అల్లరి నరేష్.. నా స్నేహితుడు, చాలా మంచి మనిషి మరణించాడని ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేశారు.

  • 19 Feb 2023 08:03 AM (IST)

    మహేష్ బాబు సంతాపం

    తారకరత్న మృతిపై మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేశారు.

  • 19 Feb 2023 08:01 AM (IST)

    తారకరత్న పార్థివదేహం

    కొద్దిసేపటి క్రితమే తారకరత్న పార్థివదేహం బెంగుళూరు నుంచి హైదరాబాద్ మోకిలాలోని ఆయన స్వగృహానికి చేరుకుంది.